Tuesday, 12 May 2026

Blog

ఖమ్మం

వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఏం ఎల్ ఏ శ్రీమతి మట్ట రాగామయి

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి ఖమ్మం స్థాఫర్) సత్తుపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణంలోని డివైడర్ పై మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్నిసత్తుపల్లి నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి మట్ట రాఘ మయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, నాయకులు పాల్గొన్నారు

ఖమ్మం

నేడు ఖమ్మం టూ టౌన్ కార్యావర్గ సమావేశం

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి ఖమ్మం స్టాఫర్ ) ఈ నెల 29 న బిజెపి ఖమ్మం జిల్లా నూతన పార్టీ కార్యాలయం ప్రారంభం కి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామ చంద్రరావు రానున్న నేపథ్యంలో నేడు సాయంత్రం 5 గంటలకు ఖమ్మం టూ టౌన్ కార్యవర్గ సమావేశం జిల్లా కార్యలయం లో జరుగుతుంది అని ఈ సమావేశం కి టూ టౌన్ భాద్యులు అందరు తప్పక హాజరు కావాలి అని టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ విజ్ఞప్తి చేశారూ

ఖమ్మం

NDRF సిబ్బంది తో కమిషనర్ భేటీ

పువ్వాడ నాగేంద్ర కుమార్ (ఖమ్మం పున్నమి స్టాఫ్ రిపోర్టర్ ) వరుసగా మూడు రోజులు గా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఖమ్మం నగర పాలక సంస్థ కమిషనర్ అభిషేక్ ఆగస్త్యా NDRF అధికారూలతో సమీక్సించారు. కమిషనర్ మాట్లాడుతూ మున్నేరు పరివాహక ప్రాంతాల్లో వరదలు సంభవిస్తే తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు గురించి చర్చించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ అవసరం అయినా ఏర్పాట్లు చేసుకోవాలి అని సూచించారు.

హైదరాబాద్

ప్రజలకు అందుబాటులో ఉండే శ్రీ గణేష్ డ్రగ్ హౌస్

ప్రజలకు అందుబాటులో ఉండే శ్రీ గణేష్ డ్రగ్ హౌస్ శ్రీ గణేష్ డ్రగ్ హౌస్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పున్నమి: జూలై 26 ప్రతినిధి దూపం అంజనేయులు అబ్దుల్లాపూర్ మెట్ మండలం రంగారెడ్డి జిల్లా, హయత్ నగర్ లోని కుంట్లూర్ ప్రధాన రోడ్డు మార్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గణేష్ డ్రగ్ హౌస్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మరియు హయత్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ గౌడ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముందుగా డ్రగ్ హౌస్ ఏర్పాటు చేసిన ఉప్పుల మాథ్స్యగిరి , మొర్రి మల్లేష్,మెండే క్రిష్ణ మరియు మెండే మల్లేష్ లకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా హయత్ నగర్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డ్రగ్ హౌస్ ఏర్పాటు చేసినందుకు వారు అభినందించారు. ఈ కార్యక్రమం సబ్ ఇన్స్పెక్టర్లు వెంకట్ రెడ్డి, నర్సింహా మరియు బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎర్రవెలి సత్యనారాయణ, బీజేపీ జిల్లా నాయకులు జంజ్య నాయక్ మరియు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్

ప్రజలకు అందుబాటులో ఉండే శ్రీ గణేష్ డ్రగ్ హౌస్

ప్రజలకు అందుబాటులో ఉండే శ్రీ గణేష్ డ్రగ్ హౌస్ శ్రీ గణేష్ డ్రగ్ హౌస్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పున్నమి: జూలై 26 ప్రతినిధి దూపం అంజనేయులు అబ్దుల్లాపూర్ మెట్ మండలం రంగారెడ్డి జిల్లా, హయత్ నగర్ లోని కుంట్లూర్ ప్రధాన రోడ్డు మార్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గణేష్ డ్రగ్ హౌస్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మరియు హయత్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ గౌడ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముందుగా డ్రగ్ హౌస్ ఏర్పాటు చేసిన ఉప్పుల మాథ్స్యగిరి , మొర్రి మల్లేష్,మెండే క్రిష్ణ మరియు మెండే మల్లేష్ లకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా హయత్ నగర్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డ్రగ్ హౌస్ ఏర్పాటు చేసినందుకు వారు అభినందించారు. ఈ కార్యక్రమం సబ్ ఇన్స్పెక్టర్లు వెంకట్ రెడ్డి, నర్సింహా మరియు బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎర్రవెలి సత్యనారాయణ, బీజేపీ జిల్లా నాయకులు జంజ్య నాయక్ మరియు తదితరులు పాల్గొన్నారు.

చిత్తూరు

దోమల నివారణకు ఫాగింగ్‌ ముమ్మరం

పలమనేరు , జులై 25( పున్నమి ప్రతినిధి ) : పలమనేరు పట్టణంలో దోమల నియంత్రణకు ఫాగింగ్‌ ప్రక్రియను మున్సిపల్ సిబ్బంది ముమ్మరం చేశారు. రోజుకొక వార్డు లో ఫాగింగ్‌ యంత్రాలతో దోమల నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ఫాగింగ్‌ చేస్తున్నారు. దోమల వృద్ధి కేంద్రాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో యాంటీ లార్వా ఆపరేషన్లు చేపడుతున్నారు. కుంటలు, చెరువులు ఇతర నీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లో యాంటి లార్వా ఆపరేషన్‌ చేపడుతున్నారు.

ఖమ్మం

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారిగా కే. సురేంద్ర మోహన్

ఖమ్మం పున్నమి ప్రతి నిధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ లోని ఉమ్మడి జిల్లాలకి ప్రత్యేక అధికారులని నియమించినది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు. ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారిగా కే సురేంద్ర మోహన్ రంగా రెడ్డి:, డి. దివ్య హైదరాబాద్: ఇలాంబారి ఆదిలాబాద్: సి. హరికిరణ్ నల్గొండ: అనిత రామచంద్రన్ నిజామాబాద్: ఆర్. హనుమంతు కరీంనగర్: సర్పరాజ్ అహ్మద్ వరంగల్: కే. శశాంక్ మెదక్. ఏ శరత్ మహబూబ్ నగర్:రవి లని ప్రత్యేక అధికారులు గా తెలంగాణ ప్రభుత్వం నియమించినది.

యాదాద్రి భువనగిరి

ఇతినా ఇస్సాబ్ ఉత్ననా బాగాదారి ఎంత జనాభానో అంత వాటా సాధించుకునేఅంతవరకు ఓబీసీలు ఏకం కావాలి*

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి సిద్దయ్య ఇతినా ఇస్సాబ్ ఉత్ననా బాగాదారి ఎంత జనాభానో అంత వాటా సాధించుకునేఅంతవరకు ఓబీసీలు ఏకం కావాలి లోకసభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ ఈరోజు ఢిల్లీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఓబిసి డిపార్ట్మెంట్ “బాగాదారి న్యాయ సమ్మేళన్” కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్చార్జ్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి మీనాక్షి నటరాజన్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గార్లతో యాదాద్రి భువనగిరి జిల్లా నుండి జైబాబు జైభీమ్ జైసంవిధాన్ కోఆర్డినేటర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ పాల్గొనడం జరిగింది ఈకార్యక్రమంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున కార్గే, లోకసభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ బాగాధారి సమ్మేళనకు విచ్చేసిన వారంతా మీ మీ ప్రాంతాలకు వెళ్లి మీ మీ గ్రామాలలో ఓబీసీలందరూ ఐక్యంగా ఓబీసీల జనాభా ఎంత ఓబిసిల వాటా అంత సాధించుకోలేనంతవరకు భారత దేశంలో ఉన్న బిజెపి పార్టీ పైన పోరాటం చేసి బీసీల కుల గణనను సాధించుకొని హక్కులను కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ 50% మించి కూడా రిజర్వేషన్లు పొందడం కోసం ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం బీసీల యొక్క వాటాను తేల్చుకొని హక్కులను సాధించుకునే అంతవరకు పోరాటం చేయాలని రానున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా దేశవ్యాప్తంగా ఎవరి జనాభా ప్రకారం వారికి వాటాలు అందించి రాజ్యాంగఫలాలు అందరికీ అందే విధంగా ప్రజా సామ్యుద్ధంగా అందిస్తామని తెలియజేశారు ఈకార్యక్రమంలో పడిగెల ప్రదీప్ ఆంజనేయులు గౌడ్ భిక్షం రామలింగం యాదవ్ శ్రీనివాస్ నేత తదితరులు పాల్గొనడం జరిగింది*

హైదరాబాద్

సి పి ఐ (ఎం) కి బాంబే హైకోర్టు షాక్

పున్నమి ప్రతినిధి ముంబైలో.. గాజా కోసం ర్యాలీ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన సీపీఐ (ఎం) నేతలు సీపీఐ(ఎం) చేసిన అభ్యర్థనను ముంబయి హైకోర్టు తిరస్కరించినది మీరు గాజా, పాలస్తీనాలోని సమస్యలను చూస్తున్నారు… మీ సొంతదేశాన్ని చూడండి. దేశభక్తులుగా ఉండండి. మన దేశంలో సమస్యలు ఉన్నాయి కదా. న్యాయమూర్తులు జస్టిస్ రవీంద్ర ఘుగే, జస్టిస్ గౌతమ్ అంఖద్ లు అన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

లంచం డిమాండ్ చేసిన పారిశుద్ధ్య కార్మికులను విధుల నుంచి తోలగింపు

*లంచం డిమాండ్ చేసిన పారిశుద్ధ్య కార్మికులను విధుల నుంచి తోలగింపు* *_పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష_* రామగుండం, జులై 25, పున్నమి ప్రతినిధి: లంచం డిమాండ్ చేసిన ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జనరల్ ఆసుపత్రి లో శుక్రవారం ఆకస్మిక తనిఖీ సమయంలో ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఏజేన్సీ ద్వారా పారిశుధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న హనుమంతు, లావణ్య రోగుల నుంచి లంచం డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇవ్వని పేషెంట్ బెడ్ల వద్ద క్లీనింగ్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు రోగుల ఫిర్యాదు ద్వారా తెలుసుకున్న కలెక్టర్ వెంటనే సంబంధిత ఔట్ సోర్సింగ్ సిబ్బంది సర్వీసులను టెర్మినెట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య సిబ్బంది హనుమంతు, లావణ్య లను ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో అనుమతించడానికి వీలులేదని కలెక్టర్ గోదావరిఖని జనరల్ ఆసుపత్రి వైద్య సూపరింటెండెంట్ ను ఆదేశించారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య వసతులను పూర్తి ఉచితంగా అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుంటే ఇటువంటి ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ, పేద రోగులను ఇబ్బందులకు గురి చేస్తూ, జిల్లా యంత్రాంగానికి అవమానకర పరిస్థితులు తీసుకువచ్చారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసే సిబ్బంది ఇంకా ఎవరైనా ఉంటే గుర్తించి విధుల నుంచి తొలగించాలని, లేనిపక్షంలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ లైసెన్సు రద్దు చేయడం జరుగుతుందని కలెక్టర్ సంబంధిత ఏజెన్సీ వర్గాలను హెచ్చరించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.