Tuesday, 12 May 2026

Blog

ఖమ్మం

ఖిల్లా అభివృద్ధి కి 29 కోట్లు మంజూరు

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా ని పర్యాటక కేంద్రం గా అభివృద్ధి చేసేందుకు కు గాను మంత్రి తుమ్మల నాగేశ్వరావ్ చొరవ తో ఖమ్మం ఖిల్లా అభివృద్ధి కి ప్రభుత్వం 29 కోట్లు మంజూరు చేసింది అని జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తి తెలియ జేశారు

అన్నమయ్య

గిట్టుబాటు ధర లేక రోడ్ ఎక్కిన బొప్పాయి రైతులు………

చిట్వేల్ జూలై 24 ( పున్నమి న్యూస్) బొప్పాయి రైతులు మద్దతు ధర లేకపోవడంతో తీవ్ర ఆవేదనతో గురువారం ఉదయం రైతులందరూ కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. చిట్వేల్ అంబేద్కర్ సర్కిల్ నుండి రైల్వే కోడూరు కి వెళ్లే కాటా ఆవరణలో బొప్పాయి రైతులు మద్దతు టన్నుకు రూ.14,000 వేలు ఉండగా ఉన్నట్టుండి వ్యాపారస్తులు 8,000 కి తగ్గించడంతో బొప్పాయి రైతులు తీవ్ర ఆవేదనకు గురిఅయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని బొప్పాయి రైతులందరూ కలిసికట్టుగా మాట్లాడుకుని ఒక యూనియన్ గా ఏర్పడి ప్రతి పంటలో వ్యాపారస్తులు చేస్తున్న అన్యాయానికి మండలంలోని అంబేద్కర్ సర్కిల్ రైల్వే కోడూరు కి వెళ్లే మార్గంలో కాటా నందు ధర్నాకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న చిట్వేలీ మండల ఎస్సై నవీన్, పోలీస్ సిబ్బంది రైతులతో మాట్లాడుతూ వ్యాపారస్తులు, రైతులు మాట్లాడుకొని సామరస్యంగా వెళ్లాలని రైతులకు నచ్చజెప్పి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. అనంతరం మధ్యాహ్నం కాటా ఆవరణలో రైతులందరూ కలిసికట్టుగా ఏర్పడి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వ్యాపారస్తులు బొప్పాయి రైతులకు టన్నుకు 16,000 వేలు మద్దతు ధర ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే క్షేత్రస్థాయిలో ఈ ధర్నాని మరింత బలోపేతం చేసి రైతులతో కలిసి ఎక్కడికక్కడ వాహనాలు నిలుపుదల చేస్తామని రైతులు హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులు వేసిన ప్రతి పంటలో వ్యాపారస్తులు, దళారులు, చేస్తున్న అరాచకాలను, గుర్తించి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా పెద్ద ఎత్తున రైతులు ప్రభుత్వానికి తెలియజేశారు

తెలంగాణ పెద్దపల్లి

వంద పడకల ఆసుపత్రి పనులను పర్యవేక్షించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

*జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్* *వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి* *_పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష_* పెద్దపల్లి, జులై 24, పున్నమి ప్రతినిధి: సీజనల్ వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం పెద్దపల్లి పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆయుష్ ఆసుపత్రిని పరిశీలించి, నూతనంగా నిర్మాణం జరుగుతున్న 100 పడకల ఆసుపత్రి పనులు, నిర్మాణం పూర్తి చేసుకున్న తాత్కాలిక క్యాజువాలిటిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఆసుపత్రి వెనుక ఉన్న చిన్న సందు విస్తరించి, అక్కడి నుంచి పేషెంట్ తరలింపు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచనలు జారీ చేశారు. సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా నిర్దారణ పరీక్షలు నిర్వహించాలని, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా కేసులు తప్పనిసరిగా రిపోర్ట్ అయ్యేలా చూడాలని అన్నారు. ఈ తనీఖీలలో కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ఆర్.ఎం.ఓ డాక్టర్ విజయ్, నర్సింగ్ సూపరిండెంట్ జమున, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

మద్దతు ధర కల్పించాలని బొప్పాయి రైతులు ధర్నా

చిట్వేలి మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ సర్కిల్ రైల్వే కోడూరు కి వెళ్లే కాటా ఆవరణలో బొప్పాయి రైతులు మద్దతు ధర లేకపోవడంతో తీవ్ర ఆవేదనతో గురువారం ఉదయం రైతులందరూ కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. బొప్పాయి రైతులకు టన్నుకు రూ.14,000 వేలు ఉండగా ఉన్నట్టుండి వ్యాపారస్తులు 8,000 కి తగ్గించడంతో బొప్పాయి రైతులు తీవ్ర ఆవేదనకు గురిఅయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని బొప్పాయి రైతులందరూ కలిసికట్టుగా మాట్లాడుకుని ఒక యూనియన్ గా ఏర్పడి ప్రతి పంటలో వ్యాపారస్తులు చేస్తున్న అన్యాయానికి మండలంలోని అంబేద్కర్ సర్కిల్ రైల్వే కోడూరు కి వెళ్లే మార్గంలో కాటా నందు ధర్నాకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న చిట్వేలీ మండల ఎస్సై నవీన్, పోలీస్ సిబ్బంది రైతులతో మాట్లాడుతూ వ్యాపారస్తులు, రైతులు మాట్లాడుకొని సామరస్యంగా వెళ్లాలని రైతులకు నచ్చజెప్పి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. అనంతరం మధ్యాహ్నం కాటా ఆవరణలో రైతులందరూ కలిసికట్టుగా ఏర్పడి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వ్యాపారస్తులు బొప్పాయి రైతులకు టన్నుకు 16,000 వేలు మద్దతు ధర ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే క్షేత్రస్థాయిలో ఈ ధర్నాని మరింత బలోపేతం చేసి రైతులతో కలిసి ఎక్కడికక్కడ వాహనాలు నిలుపుదల చేస్తామని రైతులు హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులు వేసిన ప్రతి పంటలో వ్యాపారస్తులు, దళారులు, చేస్తున్న అరాచకాలను, గుర్తించి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా పెద్ద ఎత్తున రైతులు ప్రభుత్వానికి తెలియజేశారు.

ఖమ్మం

తాండ్ర వినోద్ రావు ని ఘనంగా సత్కరించిన ధనియాకుల

ఖమ్మం పున్నమి ప్రతినిధి భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు జన్మదిన సందర్భంగా ఖమ్మం టూ టౌన్ బీజేపీ అధ్యక్షులు ధనియాకుల వెంకట నారాయణ వినోద్ రావు కి పుదీనా గజమాలతో సత్కరించడం జరిగింది. వీరితో పాటు దాసరి వీరభద్రం (రిటైర్డ్ సి ఐ )దాసరి మధు, శ్రీనివాస్ రెడ్డి, ఉపేంద్రమ్మ, అప్పారావ్, గజ్జల శ్రీనివాస్ టూ టౌన్ కమిటీ సభ్యులు ఉన్నారు.

అన్నమయ్య

గంటా న్యూరో హాస్పటల్‌లో రమణ రెడ్డి పరామర్శించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్

ఓబులువారిపల్లి మండలం, బలిరెడ్డి పల్లి గ్రామ వాస్తవ్వులు రమణ రెడ్డి గారు బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా తిరుపతి గంటా న్యూరో హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాస్పటల్ కు వెళ్లి రమణ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి శీఘ్రంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లొ రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర జోగినేని మని పాల్కొన్నారు.

అన్నమయ్య

బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న పులగంటి శివయ్య పరామర్శించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్

చిట్వేల్ మండలం, నాగవరం వడ్డీ పల్లి గ్రామ వాస్తవ్వులు జనసేన పార్టీ కార్యకర్త పులగంటి శివయ్య బ్రెయిన్ స్ట్రోక్ తో తిరుపతి రమాదేవి హాస్పటల్ ICU లొ చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆయనను ఆసుపత్రిలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన తో రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర జోగినేని మని శివయ్య గపరామర్శించారు.

ఖమ్మం

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

ఖమ్మం పున్నమి ప్రతి నిధి ఖమ్మం జిల్లాబి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి యువనేత కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో జిల్లా పార్టీ ముఖ్య నాయకులతో, కార్పొరేటర్లు, తెలంగాణ ఉద్యమకారులతో కలిసి రక్తదాన శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు ప్రారంభించారు. కేక్ కటింగ్ అనంతరం లాంగ్ లీవ్ కేటీఆర్ అంటూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేసిన పార్టీ నాయకులు కార్యకర్తలు… ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు మాట్లాడుతూ: తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. MLC, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని, కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మరియు ఖమ్మం జిల్లాలో సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమైన విషయమై తెలిపారు. కేటీఆర్ గారు అధికారంలో ఉన్న లేకున్నా తన పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా నిరుపేదలకు, విద్యార్థులకు సమాజంలోని అన్ని వర్గాల వారికి ఉపయోగకరమైన కార్యక్రమాలకు పిలుపునిస్తూ.. ప్రతి సంవత్సరం వారి పుట్టినరోజు సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు విద్యార్థులకు లాప్టాప్ లు, ఫీజులు, ప్రభుత్వ ఆసుపత్రులకు అంబులెన్సులు, వికలాంగులకు వాహనాలు ఉపయోగపడే విధంగా సమాజానికి అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రగతిలో ఐటీ రంగం రాష్ట్రంలో విస్తృతంగా ఏర్పాటు చేయడంలో లక్షలాది ప్రైవేటు ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు అందించేందుకు కృషి కేటీఆర్ చేశారని, సామాజిక సేవలో నిత్యం ముందుండే కేటీఆర్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ కోరుకుంటూ.. కేటీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ రాబోయే స్థానిక ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారం చేపడుతుందని పరిచారు. ఈ కార్యక్రమంలో ఆర్ జె సి కృష్ణ, కూరాకుల నాగభూషణం, ఉప్పల వెంకటరమణ, బొమ్మెర రామ్మూర్తి, బి రెడ్డి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ బి రెడ్డి నాగచంద్ర రెడ్డి, మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ ఖమర్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు తాజుద్దీన్, బిచ్చల తిరుమలరావు, నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, రూరల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, రఘునాధపాలెం మండలం అధ్యక్షుడు వీరు నాయక్, తిరుమలాయపాలెం మండల పార్టీ అధ్యక్షులు భాషబోయిన వీరన్న, పిన్ని కోటేశ్వరరావు, కార్పొరేటర్లు శీలంశెట్టి వీరభద్రం, దండా జ్యోతి రెడ్డి, కూరాకుల వలరాజు, శ్రీవిద్య, బత్తుల మురళి, మాజీ ముదిగొండ మండల జడ్పీటీసీ సామినేని హరిప్రసాద్, మహిళా నాయకురాలు భారతి, కొల్లు పద్మ, నాయకులు బంక మల్లన్న, శంకర్, బిక్షం, ఇంటూరి శేఖర్, ముత్యాల వెంకటప్పారావు, మెంటం రామారావు, మీగడ శ్రీనివాస్ యాదవ్, పగడాల నరేందర్, లింగనబోయిన సతీష్, బలుసు మురళీకృష్ణ, మహమ్మద్ రసూల్, సద్దాం షేక్, మద్దెల విజయ్, మాటేటి కిరణ్, చీకటి రాంబాబు, షారుక్, ఆసిఫ్, అప్సర్, బురాన్, ఆరెంపుల వీరభద్రం, ఉస్మాన్, మన్సూర్, నెమలికొండ వంశీ,‌ నెమలి కిషోర్, నారమళ్ళ వెంకన్న, ఎల్వీ రత్నం, షకీన, శైలజా, మాధవి మరియు తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

అన్నదాత సుఖీభవ పేర్లు లేని వారికి మరో అవకాశం వ్యవసాయ శాఖ అధికారి

చిట్వేలి జూలై 24 (పున్నమి ప్రతినిధి) అన్నదాత సుఖీభవ పథకంలో పేర్లు రాలేదని చాలామంది రైతులు బాధపడుతున్నారని అటువంటి వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని చిట్వేలి మండల వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్ తెలిపారు రైతులు తమకు సంబంధించిన గ్రామ సచివాలయంలో వ్యవసాయ సహాయకుల వద్ద ఉన్న అర్హుల జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకోవాలన్నారు పేరు లేని వారు వెంటనే నమోదు చేసుకోవాలని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

అన్నమయ్య

ఇనుప కడ్డీలపై నిర్లక్ష్యం లబ్ధిదారులు ఆవేదన

ఇనుప కడ్డీలపై నిర్లక్ష్యం లబ్ధిదారులు ఆవేదన చిట్వేలి పున్నమి ప్రతినిధి జూలై 24 చిట్వేలి మండలంలోని ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి లబ్ధిదారులకు ఇచ్చే ఇనుప కడ్డీలు వర్షం ఎండల వల్ల తుప్పుపట్టి పనికిరాకుండా మారుతున్నాయి గూడెం ఉన్న సిమెంట్ కి మాత్రమే భద్రత కల్పించే ఇనుప కడ్డీలను బయట నిర్లక్ష్యంగా పడవేశారు చెడిపోయిన కడ్డీలు ఇండ్లు నిర్మించేందుకు పనికిరావని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించాలంటున్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.