Tuesday, 12 May 2026

Blog

ఖమ్మం

సత్తుపల్లి మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు

*సత్తుపల్లి మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు* ఖమ్మం పున్నమి ప్రతినిధి సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు జరిగాయి సత్తుపల్లి నియోజకవర్గం లోని సత్తుపల్లి, వెంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండల కేంద్రాల్లో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

నిర్మల్

*నాంపల్లి కోర్టుకు హాజరైన మంత్రి సీతక్క*

పున్నమి ప్రతినిధి మూఢో కరోనా టైంలో నమోదైన కేసులో నాంపల్లి స్పెషల్ కోర్టుకు మంత్రి సీతక్క హాజరయ్యారు. బీఆర్ఎస్‌ హయాంలో ఇందిరాపార్క్‌ దగ్గర సీతక్క దీక్ష చేశారు. గాంధీనగర్‌ పీఎస్‌లో సీతక్క, ఎన్ఎస్ యుఐ నేతలపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు హాజరయ్యారు మంత్రి సీతక్క. అయితే తామేం తప్పు చేయలేదు, న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందన్నారు సీతక్క. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని దీక్ష చేస్తే కేసులు పెట్టారని మంత్రి సీతక్క ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు తమపై తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. కరోనా నుంచి పేదలను కాపాడాలనే ఆరోజు పోరాటం చేశానని చెప్పారు సీతక్క. కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 2021లో ఇందిరా పార్క్ వద్ద ఎన్ఎస్‌యూఐ నాయకులతో కలిసి నిరాహార దీక్ష చేశారు. ఆరోగ్యశ్రీ కింద కరోనాకు చికిత్స అందించాలని ఉచిత అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనాతో మరణించిన ప్రతి కుటుంబానికి వాళ్లు ఆసుపత్రిల్లో కట్టిన బిల్లులను సీఎంఆర్ఎఫ్ కింద చెల్లించాలని కోరారు. అయితే కరోనా నిబంధనలకు విరుద్ధంగా ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేసి కరోనా వ్యాప్తి చేస్తున్నారని అప్పటి ప్రభుత్వం సీతక్కపై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో కేసు విచారణలో భాగంగా సీతక్క ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు…

అభమానుల సమక్షంలో ఘనంగా వినోద్ రావు జన్మదిన వేడుకలు

ఖమ్మం పున్నమి ప్రతినిధి పెద్దల దీవెనలు, మిత్రులా అభినందనలు, అభిమానుల శుభాకాంక్షలు నడుమ ప్రజానాయకుడు ఖమ్మం పార్లమెంట్ బిజెపి కంటెస్టడ్ అభ్యర్థి గౌరవ నీయులు తాండ్రా వినోద్ రావు జన్మదిన వేడుకలు గురువారం నగరము లో ఫంక్షన్ హల్ నందు ఘనంగా అయన అభిమానులు నిర్వహించడం జరిగింది. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి రాష్ట్ర నాయకులు గల్ల సత్యనారాయణ హాజరు అయ్యారు. ఈ సం దర్భముగా వినోద్ రావు మాట్లాడుతూ తన జన్మదినము సందర్భముగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తనను ఒక కుటుంబ సభ్యుడిగా చేసుకొని తనను ఆదరిస్తునందుకు కృతజ్ఞతుణ్ణి అని అయన అన్నారు. ఖమ్మం పార్లమెంట్ స్థాయి లో బీజేపీ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తాను అని అన్నారు. కొత్తకోడలు అత్తారింటికి వచ్చినప్పుడు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేసినట్టు గా కొంతమంది చేస్తున్నారూ అని ఆ తప్పు లు తెలుసు కొని సరిద్దిద్దుకొని ముందు కు సాగాలని ఆలా కాకుండా ఇలానే ఉంటాను అని మొండికేస్తే నష్టపోతారు అని అయన అన్నారు. పార్టీ కోసం అందరిని కలుపుకొని ముందుకు పోవాలి అని అయన అన్నారు.

సినిమా

థియేటర్ లో సినిమా వీక్షించిన ఎమ్మెల్యే శ్రీధర్

హరిహర వీరమల్లు సినిమా విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా రైల్వే కోడూర్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గురువారం థియేటర్లో అభిమానులతో కలిసి సినిమా వీక్షించారు. ఎన్నో ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ పాత గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అన్నమయ్య

వైసీపీ కార్యకర్తలు అధైర్యపడొద్దు

ఓబులవారిపల్లి మండలంలో జరిగిన ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో – బాబు షూరిటీ మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో గురువారం రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు.వైసీపీకార్యకర్తలుఅధైర్యపడకూడదని, పార్టీ ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుందన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు, కూటమి వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

అన్నమయ్య

సీలింగ్ ఫ్యాన్లు అందజేసిన బి.కొత్తకోట తహశీల్దార్ బావాజాన్‌

గతవారం బి.కొత్తకోటలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని తహశీల్దార్ బావాజాన్‌ తనిఖీ చేశారు. ఆ సమయంలో విద్యార్థులు ఫ్యాన్లు కావాలని కోరారు. దీంతో స్పందించిన అయన గురువారం నాలుగు సీలింగ్ ఫ్యాన్లను పాఠశాలకు బహుకరించారు. ఆయనకు ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

ఖమ్మం

ఖమ్మం జిల్లా బీజేపీ లో బయట పడ్డ విబేధాలు

ఖమ్మం పున్నమి ప్రతినిధి. ఖమ్మం జిల్లా బిజెపి అంతర్గత విభేదాలు గురువారం బయట పడ్డాయి. బిజెపి పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు పుట్టినరోజు సంధర్భముగా స్థానికముగా ఒక ఫంక్సన్ హల్ నందు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసారు. అయితే ఈ సమ్మేళనం కి ప్రతి ఒక్కరికి రావాలి అని వినోద్ రావు క్యాంప్ కార్యాలయం నుండి మెసేజ్ పంపడం జరిగింది అయినా కూడా బీజేపీ ప్రస్తుత జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, నున్న రవికుమార్, కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ, నంబూరు రామలింగేశ్వరావ్, లతో పాటు పలువురు నాయకులు హాజరు అవ్వలేదు. దీన్ని బట్టి కార్యకర్తలు కానీ విశ్లేషకులు కానీ బిజెపి లో విబేధాలు ఉన్నాయా అని గుస గుస లాడుకుంటున్నారు. స్థానిక సంస్థ ల ఎన్నికల సమీపిస్తున్న వేల ఈ వర్ఘపోరు ఏంటి అని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతన పార్టీ జిల్లా కార్యలయం ప్రారంభం కి 29వ తేదీ న రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు ఖమ్మం వస్తు న తరుణం లో ఈ వర్గ విభేదాలు ఎ విధంగా దారితతీస్తాయో చూడాలి.

ఆంధ్రప్రదేశ్

సుమనశ్రీ కి అరుదైన అవకాశం

ప్రసిద్ధ అయోధ్య రామాలయ నృత్యార్చన లో భాగంగా నందలూరు ఆడపడుచు కోడూరు సుమన శ్రీ రామాలయం ఆవరణం నందు రామ పరివారం నృత్యార్చనలో ఆంధ్ర కళాకారిణిగా పాల్గొనే అరుదైనఅవకాశం కలగడం గర్వకారణం అని ఈ సందర్భంగా కోడూరు సుమన శ్రీకి నందలూరు మండలం నుండి పలువురు అభినందనలు తెలియజేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్

హరిత గ్రామ సాధనలో భాగంగా మొక్కలు నాటిన మన్నెం

వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ అరవపల్లి జిల్లా పరిషత్ మైదానము నందు వాకర్స్ ఇంటర్నేషనల్ క్యాబినెట్ డైరెక్టర్ SI మన్నెం. రామ మోహన్ సారధ్యంలో హరిత గ్రామ సాధన ప్రక్రియలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా SI మన్నెం రామమోహన్ మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంచే క్రమంలో వృక్షో రక్షతి రక్షితః అన్న సూక్తిని స్ఫూర్తిగా తీసుకొని హరిత గ్రామమే లక్ష్యంగా జిల్లా పరిషత్ మైదానం నందు మునుపు కూడా మొక్కలు నాటి సంరక్షించడం జరిగింది . అలాగే ఇవాళ కూడా మరిన్ని మొక్కలు నాటడం ద్వారా ప్రకృతిని పరిరక్షించడం కోసం అందరూ భాగస్వాములై కలిసి రావడం చాలా సంతోషం కలిగించిందని తెలియజేశారు. వర్షాకాలం మొదలైనందున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం కోసం ముందుకు రావాలని తద్వారా పచ్చదనం పెంపొందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నందలూరు PHC కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ తనికంటి వెంకటనారాయణ,మోడపోతుల రాము, తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.