Tuesday, 12 May 2026

Blog

ఖమ్మం

నేడు వినోద్ రావు జన్మదిన వేడుకలు

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ కంటెస్టడ్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు జన్మదిన వేడుకలు నర్సింహా స్వామి టెంపుల్ రోడ్ నందు గల సరిగమప ఫంక్షన్ హల్ నందు ఉదయం 11 గంటలకు జరగనున్నాయి అని తాండ్ర వినోద్ రావు క్యాంప్ కార్యాలయ ఇంచార్జి పోతుల వీర చంద్ర శేఖర్ తెలిపారు

అన్నమయ్య

సుపరిపాలనకు తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం

రైల్వే కోడూరు నియోజకవర్గం జూలై 23 (పున్నమి ప్రతినిధి) రైల్వే కోడూరు పట్టణం లక్ష్మీనగర్ ప్రాంతంలో రైల్వే కోడూరు ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి సుపరిపాలనకు తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడం, అభిప్రాయాలు వినడం, ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యాన్ని పెంపొందించడం, గత సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అందించిన పథకాలపై ,భవిష్యత్తులో జరగబోయే అభివృధి పై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా రైల్వే కోడూరు ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మంచినీటి సమస్యలు, డ్రైనేజ్, రోడ్డు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలపై ప్రజలు చేసిన ఫిర్యాదులను గమనించారు. సమస్యలపై స్పందిస్తూ, వాటిని తక్షణమే అధికారుల తో మాటాడి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సుపరిపాలన అంటే ప్రజలకు అందుబాటులో ఉండటం. నేరుగా ప్రజల వద్దకు వెళ్లడం వల్ల వారికి ఉన్న వాస్తవ సమస్యలు తెలుస్తాయి. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నమ్మకాన్ని మరింత పెంచుకుంటాం. ఇది ఒక ప్రారంభం మాత్రమే. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతి కుటుంబాన్ని కలిసేలా ప్రణాళికతో ముందుకెళ్తాం అని ముక్కా రూపానంద రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, స్థానిక కార్యకర్తలు, పెద్దఎత్తున పాల్గొన్నారు. లక్ష్మీనగర్ ప్రజలు నేతల ప్రత్యక్షంగా ఇంటికొచ్చి సమస్యలు అడిగి తెలుసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఖమ్మం

కూసుమంచి మండల బీజేపీ వర్క్ షాపు

పాలేరు నియోజకవర్గం కుసుమంచి మండలంలో భారతీయ జనతా పార్టీ కూసుమంచి మండల అధ్యక్షురాలు శ్రీమతి పుణ్యవతి అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యాశాల నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు రాబోయే స్థానిక సంస్థ ల ఎన్నికల ల్లో బిజెపి అభ్యర్థులు విజయం కోసం ప్రతి ఒక్కరు పని చేయాలి అని కోరారు పాలేరు అసెంబ్లీ ఇంచార్జ్ నున్నా రవికుమార్ ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యామ్ సుందర్ నాయక్., కుసుమంచి మండల ప్రబారి ఓబిసి మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వీరుగౌడ్,రాష్ట్ర జిల్లా నాయకులు మండలంలోని వివిధ గ్రామాల నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

హైదరాబాద్

దత్తాత్రేయ ని ఉప రాష్ట్ర పతి ని చెయ్యాలి. ముఖ్య మంత్రి రేవంత్ సూచన

భారత ఉప రాష్ట్ర పతి గా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కి ఇవ్వాలని తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి సూచించారు. అయన కి ఉప రాష్ట్ర పతి పదవి ఇస్తే బి. సి లకి న్యాయం జరుగుతుంది అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ ఇస్తే బండారు దత్తాత్రేయ ని ఉప రాష్ట్ర పతి ని చెయ్యాలి అని కోరుత అని తెలిపారు. ఆయన్ని ఉప రాష్ట్ర పతి అభ్యర్థి గా ప్రకటిస్తే ఇండి కూటమి తో తాను మాట్లాడుతా అని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

ఖమ్మం

2023 I A S లకి సబ్ కలెక్టర్ లు గా పోస్టింగ్ లు

పున్నమి ప్రతి నిధి 2023 ఐఏఎస్ లకి సబ్ కలెక్టర్ లుగా పోస్టింగ్ లు ఇచ్చారు. 1)నారాయణ ఖేడ్ సబ్ కలెక్టర్ గా ఉమా హారతి 2)బైంసా : అజ్మీరా సంకేత్ కుమార్ 3)అర్ముర్ :అభిజ్ఞన్ మాల్వీయ 4)కల్లూరు :అజయ్ యాదవ్ 5)భద్రాచలం :మృనాల్ శ్రేష్ఠ 6)బెల్లం పల్లి : మనోజ్ లని నియమించారు

అన్నమయ్య

మంగంపేట దగ్గర చెన్నకేశవ స్వామిని దర్శించుకున్న చైర్మన్ కె కె చౌదరి

ఓబులవారిపల్లి ( పున్నమి ప్రతినిధి )జూలై 23 బుధవారం టిడిపి యువనాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు గునిపాటి రామయ్య కుమారుడు గునిపాటి కిరణ్ తో కలిసి ఓబులవారిపల్లి మండలం, మంగంపేట నందు శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి ఈ కార్యక్రమములో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు యువత సభ్యులు పాల్గొన్నారు.

ఖమ్మం

ఉచిత శిక్షణ కార్యక్రమం ని ప్రారంభం చేసిన దేవకీ వాసు దేవా రావు

వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్- ఖమ్మం ( @vihekhammam ) ఆధ్వర్యంలో MJPTBCWRDC (మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీ) విద్యార్థినులకు.. Tally with GST ప్రత్యేక ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభం చేశారు ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథిగాదేవకీ వాసుదేవరావ్ పాల్గొని ప్రారంభించారు

భద్రాద్రి కొత్తగూడెం

మైనర్ కుతురు ను కొట్టిన తండ్రి పై కేసు నమోదు..

పున్నమి ప్రతినిధి(జూలై23) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండల సారాపాక గ్రామంలో మైనర్ బాలిక (8) ను తండ్రి అయిన మిర్యాల రమేష్ కొట్టుతున్నడని టోల్ ఫ్రీ నెంబర్ 1098 కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారం గా ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాలతో ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు మహమ్మద్ సాదిక్ పాషా, ఛైల్డ్ హెల్ప్ లైన్ 1098 కోఆర్డినేటర్ బానోత్ సందీప్, కేస్ వర్కర్ జి. భవాని, డిస్ట్రిక్ట్ ఛైల్డ్ ప్రోటేక్షన్ యునిట్ పివో యన్.ఐ.సి. అదూరి శేషయ్య, అవూట్ రీచ్చ్ వర్కర్ యస్. లతా, ఐసిడిఎస్ సుపర్ వైజర్ సక్కుబాయి తదితరులు బుర్గంపాడు, సారాపాక లోని బాలిక ఇంటికి రెస్కు కు వెళ్లి చేయగా బాలిక తన తల్లి తో కలిసి తన అమ్మమ్మ ఇంటికి కురివి వెళ్లినట్టు తెలిసింది. బాలిక తో విడియో కాల్ లో మాట్లాడిన ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు మహమ్మద్ సాదిక్ పాషా జరిగిన విషయం తెలుసుకుని, బాలిక తండ్రి పై పోలీస్ కేసు నమోదు కు ఆదేశాలు ఇచ్చారు. ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాలతో సుపర్ వైజర్ సక్కుబాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బుర్గంపాడు మేడ ప్రసాద్ ఫిర్యాదు స్వీకరించి క్రైమ్ నెంబర్ 206/2025 క్రింద యఫ్.ఐ.ఆర్. నమోదు చేశారని ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు మహమ్మద్ సాదిక్ పాషా తెలిపారు. 18 సంవత్సరాల లోపు బాల బాలికలను ఎవరైన కొట్టిన, ఛైల్డ్ మ్యారేజ్లు చేసిన, ఛైల్డ్ లేబర్ గా పని చేయిస్తున్న టోల్ ఫ్రీ నెంబర్ 1098 కు కాల్ చేసి ఫిర్యాదు చేయలని, కాలర్ యొక్క వివరాలు పూర్తిగా గోప్యంగా వుంచబడుతాయని ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు మహమ్మద్ సాదిక్ పాషా తెలిపారు.

చిత్తూరు

ఎస్పీ మణికంఠ చందోలు మర్యాదపూర్వకంగా కలిసిన ప్రొబేషనరి ఎస్ఐ లు

చిత్తూరు, జులై 23 ( పున్నమి ప్రతినిధి ) : చిత్తూరు జిల్లా కు కేటాయించబడిన 8 మంది ప్రొబేషనరి ఎస్. ఐ లు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కి పుష్పగుచ్ఛం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఎస్పీ ప్రొబేషనరీ ఎస్సైలతో మాట్లాడుతూ… ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలి, విధులను నిజాయితీగా నిర్వర్తించాలి, చట్టపరమైన అవగాహన పెంపొందించుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంటుకు గౌరవం తీసుకురావాలి, ప్రజల విశ్వాసం సంపాదించాలి, బాధ్యతాయుతంగా పని చేయాలని సూచనలు చేశారు.

ఖమ్మం

రాష్ట్ర ప్రభుత్వం రైతు ల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహారిస్తుంది కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల అత్యంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నదని కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా మధిర రూరల్ మండలం మాటూరు రెవిన్యూ పరిధిలో దశాబ్దాలుగా బలహీనవర్గాలు షెడ్యూల్ కులాలు సాగు చేసుకుంటున్న భూములు కెసిఆర్ ప్రభుత్వ హయాంలో సుమారు 200 ఎకరాలకు పైగా భూములు ధరణి పోర్టల్ తప్పుల కారణంగా వక్ఫ్ భూములుగా నమోదు అయిన నేపథ్యంలో రైతులు న్యాయస్థానంలో న్యాయపోరాటం చేస్తున్నారు . ఈ క్రమంలో నాగపూర్ అమరావతి జాతీయ రహదారి విస్తరణలో సుమారు పది ఎకరాల భూమి రహదారి విస్తరణ పనులకు సేకరించిన నేపథ్యంలో రైతులు పరిహారం ఇప్పించాలని అధికారులకు మొరపెట్టుకున్న టైటిల్ డిస్ప్యూట్ పెండింగ్ ఉన్నదని తెలిసినా అధికార యంత్రాంగం కేంద్రం సదరు భూములకు ఇచ్చిన పరిహారాన్ని వక్ఫ్ బోర్డు లో ఏక పక్షం గా జమ చేయడం దుర్మార్గం అని అన్నారు.నిబంధనలకు విరుద్ధం . ప్రాజెక్టు విస్తరణలో భూములు కోల్పోయి పరిహారం అందక రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం ధరణి పోర్టల్ లో తప్పులు దొర్లాయని వాటన్నిటిని సరిదిద్ది వాస్తవమైన హక్కుదారులకు పట్టాలిస్తామని చెప్పి ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం ఉదారంగా వ్యవహరించి ఇచ్చినటువంటి న్యాయమైన పరిహారాన్ని సుమారు రెండు కోట్ల రూపాయలను అనాలోచితంగా వక్ఫ్ బోర్డులో ఎలా జమ చేశారో చెప్పాలన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి కేంద్రం ఇచ్చిన పరిహారాన్ని వాస్తవ రైతులకు ఇవ్వాలని కొండపల్లి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేసారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.