Tuesday, 12 May 2026

Blog

ప్రకాశం

ట్రాఫిక్ సమస్య

నడిరోడ్డుపై తోపుడు బండ్లు… నగరంలో ట్రాఫిక్ జామ్ పున్నమి ప్రతినిధి, జూలై 23,ప్రకాశం జిల్లా, పామూరు: ముందుకెళ్ళేందుకు దారి లేదు, వెనక్కి తిరిగేందుకు అవకాశం లేదు.ఇది శుక్రవారం పట్టణంలోని విరువూరు రోడ్,సీఎస్ పురం రోడ్ కూడళ్ళలో ట్రాఫిక్ పరిస్థితి.నడిరోడ్లపైకి తోపుడు బండ్లు వచ్చి నిలబడుతూ ఉండడంతో భారీ వాహనాలు, ద్విచక్ర వాహనాలు, స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఇటీవల ప్రధాన రహదారులను ఆక్రమించుకుని ఉన్న అక్రమ కట్టడాలను తొలగిస్తూ వచ్చిన పంచాయితీ శాఖ విరువూరు రోడ్ లో మాత్రం పూర్తి స్థాయిలో తొలగింపును చేపట్టకుండా ఆగిపోవడంతో ఈ సమస్య తలెత్తుతోంది.దీంతో వాహనాలన్నీ రెండు వైపులా రోడ్లపై నిలబడిపోతున్నాయి.భారీ వాహనాలైతే కూడలిలోని మూల మలుపు వద్ద టర్నింగ్ తీసుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి.విరువూరు రోడ్ లో పంచాయితీ శాఖ ఆక్రమణల తొలగింపు చర్యలు మధ్యలో ఎందుకు ఆపేయవలసి వచ్చిందో అర్థం కావడం లేదని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఈ కారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే దానికి పంచాయితీ శాఖ బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రజలు సదరు శాఖలను హెచ్చరించారు.

ఖమ్మం

నీట్ పై తెలంగాణ ప్రభుత్వం కి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

ఖమ్మం పున్నమి ప్రతినిధి నీట్ పరిక్ష విషయం లో స్థానికత విషయానికి పరిష్కారం వెతకాలి అని, విద్యార్థుల ని ఇబ్బందులకి గురించేయ్యొద్దు అని తెలంగాణ ప్రభుత్వం కి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నీట్ పరీక్ష రాయడానికి ముందు 4 ఏళ్ళు చదివితేనే స్థానికత వర్తిస్తుంది అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిబంధన పెట్టిన సంగతి తెలిసిందే. తదుపరి విచారణ ఆగస్టు 5 కి వాయిదా వేసింది సుప్రీం కోర్టు

ఖమ్మం

రేపు తాండ్ర వినోద్ రావు ఆత్మీయ సమావేశం

ఖమ్మం పున్నమి ప్రతినిది భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు జన్మదినం సందర్భముగా గురువారం ఖమ్మం లోని నర్సింహా స్వామి టెంపుల్ రోడ్ నందు గల సరిగమప ఫంక్షన్ హల్ నందు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు వినోద్ రావు క్యాంప్ కార్యలయ ఇంచార్జ్ పోతుల వీర చంద్ర శేఖర్ తెలిపారు.

అన్నమయ్య

చిట్వేలి లోసమాచార హక్కు చట్టం 2005 పై మండల స్థాయి అవగాహన కార్యక్రమం

చిట్వేలి లోసమాచార హక్కు చట్టం 2005 పై మండల స్థాయి అవగాహన కార్యక్రమం చిట్వేలి (పున్నమి ప్రతినిధి )జులై 23 చిట్వేల్ లోని మండల వ్యవసాయ కార్యాలయం నందు సమాచార హక్కు చట్టం 2005 పై మండల స్థాయి అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యాక్రమం కి ముఖ్య అతిధి గా సహాయ వ్యవసాయ సంచాలకులు, రైల్వే కోడూరు శ్రీ ఎస్. మణి హజరు కావడం జరిగింది. ప్రజలు తమకు కావలసిన సమాచారం ప్రతి శాఖ నందు సంబంధిత పౌర సమాచార అధికారి కి దరఖాస్తు చేసి సమాచారం ను పొందవచ్చునని తెలిపారు.ఈ సందర్బముగా సమాచార చట్టం 2005 విధి విధానాలు వివరించడం జరిగింది.. ఈ కార్యక్రమం లొ మండల వ్యవసాయ అధికారి, చిట్వేల్ శ్రీ జి సుధాకర్, వి ఏ ఏ, వి హెచ్ ఏ లు, ఏపీ సీఎం ఎఫ్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు

అన్నమయ్య

చిట్వేలి లోసమాచార హక్కు చట్టం 2005 పై మండల స్థాయి అవగాహన కార్యక్రమం

చిట్వేలి (పున్నమి ప్రతినిధి )జులై 23 చిట్వేల్ లోని మండల వ్యవసాయ కార్యాలయం నందు సమాచార హక్కు చట్టం 2005 పై మండల స్థాయి అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యాక్రమం కి ముఖ్య అతిధి గా సహాయ వ్యవసాయ సంచాలకులు, రైల్వే కోడూరు శ్రీ ఎస్. మణి హజరు కావడం జరిగింది. ప్రజలు తమకు కావలసిన సమాచారం ప్రతి శాఖ నందు సంబంధిత పౌర సమాచార అధికారి కి దరఖాస్తు చేసి సమాచారం ను పొందవచ్చునని తెలిపారు.ఈ సందర్బముగా సమాచార చట్టం 2005 విధి విధానాలు వివరించడం జరిగింది.. ఈ కార్యక్రమం లొ మండల వ్యవసాయ అధికారి, చిట్వేల్ శ్రీ జి సుధాకర్, వి ఏ ఏ, వి హెచ్ ఏ లు, ఏపీ సీఎం ఎఫ్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు

ఖమ్మం

రైతన్న ల సమస్య లను వెంటనే పరిష్కరించాలి. BKS డిమాండ్

భారతీయ కిసాన్ సంఘ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పగడవరపు శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో బుధవారం జాయింట్ కలెక్టర్ ని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు కలిసి పలు సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది.. ఈనెల 15వ తారీకు నేలకొండపల్లిలో జరిగిన ఖమ్మం జిల్లా భారతీయ కిసాన్ సంఘ్ విస్తృత కార్యకర్తల సమావేశంలో చేసిన రెండు తీర్మానాల కాపీలను కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా భారతీయ కిసాన్అ సంఘ్ధ్య క్షులు శ్రీ పగడవరపు శ్రీనివాసరావు గ మాట్లాడుతూ… * సీతారామ ప్రాజెక్టు ద్వారా కారేపల్లి కామేపల్లి ఏన్కూరు మండలాలకు నీళ్లు ఇవ్వాలని ఆ మండలాలు పూర్తిగా వర్షాధారంపై ఆధారపడి ఉన్నాయని అన్నారు.. పాత ప్లాన్ ప్రకారం కాలువలు తొవ్వి అన్ని ఏర్పాట్లు ఉన్నప్పటికీని అటువైపు నీరు ఇవ్వకపోవడం దురదృష్టకరమని ఏజెన్సీ రైతులపై ప్రబుత్వం వివక్షను చూపడం దురదృష్టకరం అని ఈ మేరకు జిల్లా సమావేశం చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి అందించాలని కోరారు * ⁠అదే విధంగా ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున సాగవుతున్న సీడ్ మొక్కజొన్న రైతులకు కంపెనీలకు మధ్య దళారీలు తీవ్రంగా మోసం చేస్తున్నారని కాబట్టి నేరుగా కంపెనీలే సీడ్ మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకు విత్తనాల నుంచి నేరుగా వారి ఖాతాలో డబ్బులు జమ చేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాలని భారతీయ కిసాన్ సంఘ్ చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి గౌరవ జాయింట్ కలెక్టర్ ద్వారా అందించడం జరిగింది. దానితోపాటు కూసుమంచి మండలం చేగుమ్మ గ్రామంలో భక్త రామదాసు కాలువ నష్టపరిహారం ఇవ్వని కారణంగా రైతు కాలువ పూడ్చడం తొ కాలువ నీళ్లు రైతుల పొలాల నుండి పోతూ నష్టం జరుగుతుందని ఈ సమస్యపై వెంటనే దృష్టి పెట్టి పరిష్కరించాలని కోరడం జరిగింది * ⁠అదేవిధంగా తనికెళ్లలో చేలకు వెళ్లే డొంకా పూర్తిగా బురదమయమై నీళ్లు నిలబడి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న దృశ్య రోడ్డు వేయాలని కోరడం జరిగింది.. * ⁠చింతకాని మండలం తిమ్మినేనిపాలెం లో గతంలో ఉన్న డొంకను కొంతమంది ఆక్రమించి రైతులను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని గౌరవ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించాలని కోరడం జరిగింది. * అదేవిధంగా కొనిజర్ల మండలం రామనర్సయ్య నగర్ సంబంధించి సీడ్ విత్తనాలు పండించిన రైతులను ఆరు నెలల నుండి డబ్బులు ఇవ్వకుండా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న మధ్యవర్తి సైదాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సదురు రైతులకు నగదు ఇప్పించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ ఖమ్మం జోన్ కార్యదర్శి మందనపు రామారావు జిల్లా కార్యదర్శి తాళ్లూరు శ్రీనివాసరావు జిల్లా సహాయ కార్యదర్శి తూము అప్పారావు కొనిజర్ల మండల అధ్యక్షుడు సత్యనారాయణ శ్రీనివాస్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

చిత్తూరు

రోడ్లు, డ్రైనేజీలు లేక అవస్థలు పడుతున్న ప్రజలు

పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు కు చెందిన లక్ష్మీనగర్(లిటిల్ ఏంజిల్స్ స్కూల్ ఏరియా)కు మౌళిక సదుపాయములు లేకపోవడంతో అక్కడి వారు నానా అవస్థలు పడుతున్నారు.గత దశాబ్ద కాలం పైగా మురుగునీటి కాలువలు ఇప్పటికీ లేకపోవడంతో దాదాపు 150 ఇళ్ళ నుంచి బయటకు వస్తున్న మురుగునీరు వీధుల గుండా వస్తుండడంతో విధిలేక ఆ మార్గం లోనే ముక్కులు మూసుకొని తిరుగుతూ అనారోగ్యం పాలవుతున్నారు. ఎగుడు దిగుడు రోడ్లతో నిత్యం కుస్తీ పడుతున్నారు. కాస్తా వర్షం కురిసినప్పుడు ఇంటి నుంచి బయటకు రావడం కష్టంగా ఉంటుందని, బురదలో ప్రయాణించాలని కాలనీ వాసులు వాపోతున్నారు.ఈ సమయంలో మహిళలు వృద్ధులు చిన్న పిల్లలు పరిస్థితి వర్ణాతీతం అన్నారు.ఇటువంటి రోడ్లపై ద్విచక్ర వాహనాన్ని నడుపలేక బురదలో జారి పడిపోయిన సంఘటన లు అనేకంగా ఉన్నాయన్నారు. ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లలు వీధులలో ఆడుకొనే పరిస్థితి లేదన్నారు.దీనికి తోడు పాములు, విష పురుగులు యధేచ్చగా ఇండ్లలో వచ్చేస్తున్నాయoటున్నారు.ఇంకనూ తమ కాలనీకి కొళాయి కనెక్షన్ లు,పైపు లైన్ లు, వీధిలైట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఇలా చెప్పుకొంటూ పోతే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటూ మున్సిపాలిటీ ప్రాంతంలోనే వెనుకబడిన కాలనీగా ఉందని అక్కడి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కనుక ఇప్పటికైనా తమ కాలనీ వాసులకు మునిసిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు కలసి అత్యవసరoగా మౌలిక సదుపాయాలు కల్పించాలని కాలనీ వాసులు విజయశేఖర్ రెడ్డి,ఆంజనేయులు, ఏ.ఆర్.కుమార్,సెంథిల్ కుమార్, వెంకటాచలం,హరి ప్రసాద్, ధనంజయులు, జిలానీ,కస్తూరి,చంద్రారెడ్డి,విజయ్ కుమార్, సుబ్రమణ్యం, శివమోహన్, బాలసుబ్రమణ్యం, సుధాకర్ ,మాధవ్,వాసుమూర్తి తదితరులు ముక్త కంఠంతో కోరుతున్నారు.

అన్నమయ్య

హరిహర వీరమల్లు “మహార్యాలీ”కి భారీ షురూ – బలిజ వీధి శ్రీ గంగమ్మ తల్లి వద్ద ప్రత్యేక పూజలు

రైల్వే కోడూరు నియోజకవర్గంలో “హరిహర వీరమల్లు” ఉద్యమాన్ని మహోత్సవంలా. బుధవారం బలిజ వీధి గంగమ్మ తల్లి ఆలయంలో గౌరవ ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆధ్వర్యంలో, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలు జనసేన అధినేత ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గోత్ర నామాలతో,ఆయన కల్యాణ పరిపాలనకు మద్దతుగా నిర్వహించారు. సంఖ్యలో జనసేన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అనగా జూలై 23న జరగబోయే మహార్యాలీకి ఇది ఓ శుభ సంకేతం.ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మాట్లాడుతూ – “ప్రజల కోసం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ అండగా నిలబడే సమయం ఇది. రాబోయే మహార్యాలీకి కుటుంబ సమేతంగా తరలిరండి.. మన డిప్యూటీ ముఖ్యమంత్రి కి మీ మద్దతును తెలియజేయండి” అని ప్రస్తుత.రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారు – “రైల్వే కోడూరులో వీర మల్లు విశ్వరూపం చూపించాలి. యువత, కార్యకర్తలంతా ఏకతాటిపై ర్యాలీకి సిద్ధమవ్వాలి.. సాయంత్రం జరగబోయే ఈ మహా ర్యాలీలో మనకు మన నాయకుడి మీద ఉన్న అభిమానాన్ని చాటి చెబుదాం” అంటూ జోష్ నింపారు.బుధవారం సాయంత్రం 5 గంటలకు “హరిహర వీరమల్లు” మహార్యాలీ ప్రారంభం. రైల్వే కోడూరు ప్రజలు, యువత, జనసేన అభిమానులుపెద్దఎత్తున తరలివచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుకుందాం.

ఖమ్మం

ఖమ్మం అభివృద్ధి అంటే ఇదేనా… బిజెపి నేత ధనియాకుల

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేసాం అని గొప్పలు చెప్పుకుంటూన్న జిల్లా మంత్రులు వర్షా కాలం లో ఒక సారి ఖమ్మం పాత బస్ స్టాండ్, మరియు ఖమ్మం రోడ్ల ని పరిశీలిస్తే వారు అభివృద్ధి ఎంత వరకు చేసారో వారికే అర్ధం అవుతుంది అని ఖమ్మం టూ టౌన్ బిజెపి అధ్యక్షులు ధనియాకుల వెంకట నారాయణ యాదవ్ అన్నారు. వర్షం కురిస్తే డ్రైనేజ్ లో నీరు రోడ్ల మీద కి వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని అయన ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభం లోనే సమస్య లు ఇలా ఉంటే రాబోయే కాలం లో ఇంకా సమస్య తీవ్రంగా ఉంటుంది అని అన్నారు. మంత్రులు, అధికారులు వెంటనే స్పందించి వర్షాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులని పరిష్కరించాలి అని ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్డ్ డిమాండ్ చేసారు.

ఖమ్మం

దళరులని నమ్మి మోస పోవద్దు. ఖమ్మం జిల్లా వైద్యాశాఖ అధికారిని కళావతి భాయ్

ఖమ్మం పున్నమి ప్రతినిధి జిల్లా వైద్య శాఖ లో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ డేట ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ లు ఖాళీ లేవని దళారుల మాయ మాటలు విని మోసపోవద్దు అని ఖమ్మం జిల్లా వై ద్య శాఖ అధికారి శ్రీమతి కళావతి భాయ్ తెలిపారు. ఒక వేల ఖాలి లు ఏర్పడితే ప్రభుత్వం యొక్క నియమ నిబంధన లకి లోబడి పూర్తి చేస్తమే తప్ప దళారులతో కాదు అని ఆమె తెలిపారు. ఇటీవల కాలం లో ఇటువంటి సంఘటన లు తమ ద్రుష్టి కి వచ్చాయి అని అందుకే ప్రకటన విడుదల చేసినట్లు ఆమె తెలిపారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.