శ్రీకాళహస్తి, మే 12 (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను విశిష్ట సేవలు అందించిన సిబ్బందిని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సేవా పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. విధుల్లో అంకితభావంతో పనిచేసిన ఉద్యోగులకు పట్టువస్త్రాలు అందజేసి ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో శ్రీకాళహస్తి మున్సిపాలిటీ 7వ స్థానంలో నిలవడం గర్వకారణమని తెలిపారు. పట్టణ పరిశుభ్రత, పన్నుల వసూళ్లు, ప్రజా సేవలు వంటి ప్రతి విభాగంలోనూ మున్సిపల్ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. పట్టణ అభివృద్ధిలో మున్సిపల్ కార్మికుల పాత్ర కీలకమని పేర్కొన్న ఆయన, ఇదే సేవాభావంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కష్టపడి పనిచేసే ప్రతి ఉద్యోగికి ప్రభుత్వం తగిన గుర్తింపు, గౌరవం అందిస్తుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

ఉత్తమ సేవలకు మున్సిపల్ సిబ్బందికి ఎమ్మెల్యే సేవా పురస్కారాలు