Tuesday, 12 May 2026

Blog

జయశంకర్ భూపాలపల్లి తెలంగాణ

విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని వినతి

*విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని వినతి* మహదేవపూర్, జులై 25, పున్నమి ప్రతినిధి: భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు బస్సు సౌకర్యాన్ని కల్పించాలని కళాశాల ప్రిన్సిపల్ ఎన్. నర్సయ్య శుక్రవారం భూపాలపల్లి డిపో మేనేజర్ ఇందు కు వినతిపత్రం సమర్పించారు. ప్రతి దినం కాలేశ్వరం నుండి వచ్చే విద్యార్థులకు కళాశాలకు సమీపములో గల బోమ్మాపూర్ ఎక్స్ రోడ్ వద్ద బస్సులు ఆపాలని వారు కోరారు. దీంతోపాటు మహదేవ్ పూర్ మండలంలోని సర్వాయి పేట, పంకేన, అంబటిపల్లి, సూరారం, గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం శనివారం నుండి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన డిపో మేనేజర్ ఇందు కు కళాశాల అధ్యాపకులు కృతజ్ఞతలు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ప్రసాద్, రమేష్,పాల్గొన్నారు.

ఖమ్మం

ప్రధాని గా నేటి కి 4078 రోజుల పదవి కాలం పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ

పున్నమి ప్రతినిధి పువ్వాడ నాగేంద్ర కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత రాజకీయాల్లో మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నారు..!! నేటితో (జూలై 25, 2025) ఆయన 4,078 రోజుల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు..!! ఇందిరా గాంధీ 4,077 రోజులు నిరంతరాయంగా ప్రధానమంత్రిగా ఉన్న రికార్డును అధిగమించారు..!! ప్రస్తుతం మోడీ దేశంలో అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన రెండవ ప్రధానమంత్రిగా రికార్డుకెక్కారు ఇదిలా ఉండగా.. మోడీ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా తన పదవీకాలాన్ని ప్రారంభించారు..!! రాష్ట్రం, కేంద్రం రెండింటిలోనూ దాదాపు 24 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపించారు..!! ఈ ఘనత ఇప్పటివరకు మరే ఇతర భారత ప్రధానమంత్రి పేరు మీద లేదు. మోడీ రాజకీయ ట్రాక్ రికార్డ్‌లో వరుసగా మూడు జాతీయ ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపించారు..!! ఈ ఘనత గతంలో జవహర్‌లాల్ నెహ్రూ మాత్రమే సాధించారు..!! ఇంతే కాదు ఇంకా చాలా రికార్డులు సొంతం చేసుకున్నారు. అవేంటో చూద్దాం. 1)స్వతంత్ర భారతదేశంలో జన్మించిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్రమోడీ..!! 2)అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధాని.. 3)రెండు టర్ములు పూర్తి చేసి, మూడవసారి ఎన్నికైన మొదటి కాంగ్రెసేతర నాయకుడు..!! 4)లోక్‌సభలో స్వయంగా మెజారిటీ సాధించిన మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి..!! 5)ఇందిరా గాంధీ తర్వాత వరుసగా రెండుసార్లు పూర్తి మెజారిటీ సాధించిన మొదటి ప్రధానమంత్రి.. 6)2002, 2007, 2012 (గుజరాత్), 2014, 2019, 2024 (లోక్‌సభ) – వరుసగా ఆరు విజయాలు సొంతం చేసుకున్న ప్రధాని

ఖమ్మం

అత్యవసరము అయితే 100 కి సమాచారం ఇవ్వండి :సీపీ

ఖమ్మం పున్నమి ప్రతి నిధి భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పలు సూచన లు చేసారు. ఆత్యవసరం అయితే 100, 1077, 871265911130, 906321129 నెంబర్ లకి సమాచారం ఇవ్వాలని అని కమిషనర్ తెలిపారు. పొంగుతున్న వాగులు, వంకలు ని దాటద్దు అని కమిషనర్ సునీల్ దత్ ప్రజలకి విజ్ఞప్తి చేశారూ

ఆంధ్రప్రదేశ్

ఉపాద్యాయుల, ఏంటిఎస్ ఉపాద్యాయులు సమస్యలు పట్ల ఏన్టిఏ వినతి

విజయవాడ,జూలై 25 ( పున్నమి ప్రతినిధి) : ఏ.పీ.రాష్ట్రంలోని ఉపాద్యాయుల, ఏంటిఎస్ ఉపాద్యాయులు – 1998,2008 ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పట్ల తూర్పు రాయలసీమ పట్టభద్రుల శాసనమండలి సభ్యులు కంచర్ల శ్రీకాంత్ ని క్యాంపు కార్యాలయం నందు,మాజీ శాసనమండలి సభ్యులు టి.డి జనార్దన్ ని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండూరు శ్రీనివాసరాజు, చిత్తూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జయప్రకాష్ నాయుడు, చందనం రామయ్యలు కలసి… 2003 DSC ఉపాధ్యాయులకు మెమో 57ను అమలుపరచి పాత పెన్షన్ వర్తింపజేయాలని, బదిలీ పొంది రిలీవ్ కానీ ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని, నూతనంగా బదిలీ అయిన ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు , కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, ఎంటిఎస్ ఉపాధ్యాయులకు ప్రతినెల జీతాలు చెల్లించాలని, అదేవిధంగా వారి పదవీ విరమణ వయస్సు ను 62 సంవత్సరాలకు పెంచాలని, ప్లస్ టు కాలేజీలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, నెలవారి పదోన్నతులు చేపట్టాలని తదితర పలు ఉపాధ్యాయ సమస్యలపై వినతి పత్రం అందించడం జరిగిoది. ఈ సందర్భంగా ఏంఎల్సిలు మాట్లాడుతూ…. నోబుల్ టీచర్స్ అసోసియేషన్ సంఘ నాయకులు ప్రాతినిధ్యం చేసిన ప్రతి సమస్యను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో వీలైనంత త్వరగా చర్చించి పరిష్కారమునకు కృషి చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగిందని ఎన్టీఏ నాయకులు తెలియజేశారు.

యాదాద్రి భువనగిరి

BRS పార్టీ విద్యార్థి విభాగం(BRSV) రాష్ట్ర స్థాయి ముఖ్య కార్యకర్తల సదస్సు విజయవంతం చేయాలి

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి సిద్దయ్య BRS పార్టీ విద్యార్థి విభాగం(BRSV) రాష్ట్ర స్థాయి ముఖ్య కార్యకర్తల సదస్సు విజయవంతం చేయాలి *BRSV జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కినగేష్* రేపు హైదరాబాదులో ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో మల్లాపూర్ VNR గార్డెన్ లో BRS పార్టీ విద్యార్థి విభాగం (BRSV), రాష్ట్ర స్థాయి ముఖ్య కార్యకర్తల సదస్సును విజయవంతం చేయాలని. *BRSV జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కినగేష్ వెల్లడించారు* శుక్రవారం రోజున ప్రకటనలో తెలిపినారు ఉదయం 10 గంటలకు విద్యార్థుల ప్రతినిధుల సదస్సు ప్రారంభం అవుతుంది. ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా. మాజీ మంత్రులు కేటీఆర్. హరీష్ రావు .జగదీశ్వర్ రెడ్డి. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు హాజరవుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానం విద్యారంగం మీద భవిష్యత్ కార్యాచరణ నిర్వహించడం జరుగుతున్నది కావున ఈ సదస్సుకు విద్యార్థి నాయకులు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను.

జాతీయ అంతర్జాతీయ తెలంగాణ హైదరాబాద్

ఇ గవర్నెన్స్, డిజిటలైజేషన్లో ఎస్తోనియా దేశ సహకారం తీసుకుంటాం: ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు

*ఇ గవర్నెన్స్, డిజిటలైజేషన్లో ఎస్తోనియా దేశ సహకారం తీసుకుంటాం: ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు* హైదరాబాద్/మంథని, జులై 25, పున్నమి ప్రతినిధి: ఇ – గవర్నెన్స్, హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్ లో ప్రపంచంలోనే అద్భుత ప్రగతి సాధించిన ఎస్తోనియా దేశ సహకారం తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ రెండు రంగాల్లో ఎస్తోనియా దేశం అగ్రగామిగా ఎదగడం అబ్బురపరుస్తోందని ఆయన ప్రశంసించారు. శుక్రవారం ఎస్తోనియా దేశ రాయబారి మ్యారియే లూప్ ఆధ్వర్యంలో సచివాలయంలో తనను కలిసిన వాణిజ్య ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. వీరిలో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజి, కృత్రిమ మేధ, రోబోటిక్స్, ఆరోగ్య రంగాల ప్రతినిధులు ఉన్నారు. తెలంగాణా ప్రజల ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్లో ఇంకా ప్రథమ దశలోనే ఉందని, వంద శాతం ప్రగతి సాధించిన ఎస్తోనియా దేశం తమకు సాంకేతిక సహకారం అందించాలని శ్రీధర్ బాబు కోరారు. వాణిజ్యం, ఏఐ సాంకేతికతలో కూడా కలిసి పనిచేయాలన్ని ఆకాంక్షను ఆయన వెలిబుచ్చారు. ప్రజా సేవల విభాగాలను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు ఇ – గవర్నెన్స్ కీలకమని ఆయన తెలిపారు. ఇందులో ఎస్తోనియా దేశ తోడ్పాటును కోరుతున్నామని, సైబర్ సెక్యూరిటీలో కూడా పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందనీ, డ్రోన్ టెక్నాలజిలో తెలంగాణాలో గణనీయ అభివృద్ధి సాధించిందనీ మంత్రి తెలిపారు. ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో హైదరాబాద్ లో తయారైన డ్రోన్లు శత్రు దేశానికి భారీ నష్టం కలిగించాయనీ, భవిష్యత్తు యుద్ధాలు డ్రోన్లు, సైబర్ దాడులతోనే జరుగుతాయని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, బ్రాండెడ్ మద్యం ఉత్పత్తిలో ముందున్నామని, ఈ రంగాల్లో కూడా కలిసి పనిచేసే విషయాన్ని పరిశీలించాలనీ ప్రతినిధులను కోరారు. సెప్టెంబరులో తమ దేశం సందర్శించాలని ఎస్తోనియా రాయబారి మ్యారియే లూప్ చేసిన అభ్యర్థనకు శ్రీధర్ బాబు స్పందించారు. తమ అధికారుల బృందం వస్తుందని, విద్య, ఇ గవర్నెన్స్, ఏఐ, రోబోటిక్స్ లో పరస్పరం సహకరించుకునే విషయంపై చర్చిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ (మీ సేవ) కార్పోరేషన్ కమిషనర్ రవికిరణ్, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం

జూటూరు బషీర్ హెచ్చరిక. పెద్దారెడ్డి పై ఫైర్

తాడిపత్రి పున్నమి ప్రతినిధి జూలై 25 జూటూరు బషీర్ పెద్దారెడ్డి కి హెచ్చరిక ప్రశాంతంగా ఉంటున్న తాడిపత్రి ప్రజలను ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నావు పెద్దారెడ్డి , మా ప్రభాకర్ రెడ్డి అన్న ఊర్లో లేనపుడు దొంగలాగా రావాలనుకుంటున్నవు కానీ నిన్ను రానివ్వము జూటూరు బషీర్ అంటే ఏమనుకుంటున్నావ్ నీకు ముందు ముందు తెలుస్తుంది , అంటున్న జూటూరు బషీర్ సైన్యం

అన్నమయ్య

రైల్వే కోడూరు అభివృద్ధి విషయమై గౌరవ ముఖ్యమంత్రి కీలక చర్చలు చేసిన ముక్కా రూపానంద రెడ్డి

రైల్వేకోడూరు జూలై 25 పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు అభివృద్ధిపై సీఎం తో ముక్కా రూపానంద రెడ్డి కీలక సమావేశంబాధితుల ఇళ్లకు స్వయంగా వెళ్లి ముక్కా రూపానంద రెడ్డి ఎమ్మెల్యే అందిస్తున్న రిలీఫ్ ఫండ్ పంపిణీ సేవలను ప్రశంసించిన సీఎం రాష్ట్ర సచివాలయంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియుకూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను సీఎం వివరించి, నూతన ప్రాజెక్టుల ఆమోదం కోసం విజ్ఞప్తి చేశారు.ప్రత్యేకంగా,రోడ్డు విస్తరణ,తాగునీటి ప్రాజెక్టులు,పట్టణ మౌలిక వసతుల విస్తరణపై ముఖ్యమంత్రి వినతులు అందజేశారు.అలాగే ఇటీవలే సీఎం రిలీఫ్ ఫండ్ కింద సాయాన్ని అందుకున్న బాధితుల నివాసాలకు స్వయంగా వెళ్లి చెక్కులను పంపిణీ చేసిన ముక్కా రూపానంద రెడ్డి ,ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సేవాప్రవణతను సీఎం ప్రశంసించారు. ప్రజల మధ్య నేరుగా ఉండి సేవలందించడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ సమావేశంలో కోడూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉండబోతుందని సీఎం హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆశీర్వచనాలు, మార్గనిర్దేశనం పట్ల ముక్కా రూపానంద రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ఖమ్మం

ఆక్రమణ లు తొలగించి అభివృద్ధి పనులు చేపట్టాలి. బిజెపి నేత శ్రీనివాస్ రెడ్డి డిమాండ్

*ఖిల్లా చుట్టూ ఆక్రమాణాలు తొలగించి ఖిల్లా ని అభివృద్ధి చెయ్యండి* ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం ఖిల్లా అభివృద్ధి కి తెలంగాణ ప్రభుత్వం 29 కోట్లు కేటాయించినది. దీన్ని స్వాగటిస్తున్నాం అని బిజెపి నాయకులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.అయితే ఖిల్లా చుట్టూ ఉన్నంటటువంటి ఆక్రమణలు తొలిగించి ఖిల్లా కి వెళ్ళడానికి విశాలమైన దారిని ఏర్పాటు చెయ్యాలి అని, కుల మతాలకి ఆతీతం గా ఎవరు ఆక్రమించుకున్న తొలగించాలి అని తరువాత ఖిల్లా అభివృద్ధి పనులు మొదలు పెట్టాలి అని బిజెపి నాయకులు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారూ

ఖమ్మం

తి. తి.దే ఆధ్వర్యంలో ఖమ్మం లో శ్రీవారి ఆలయం

ఖమ్మం పున్నమి ప్రతినిధి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఖమ్మం లో శ్రీ వారి ఆలయం నిర్మిస్తూన్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరావ్ తెలిపారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బి. ఆర్ నాయుడు కి ప్రతి పాదనలు పంపినట్లు తెలిపారు రఘు నాధ పాలెం లో దేవస్థాన నిర్మాణం కి అను వైన స్థలం ని టి. టి. డి బృందం పరీశీలించినది అని ఖమ్మం నగరానికి ఐ కాన్ గా శ్రీవారి దేవాలయ నిర్మాణం జరుగుతుంది అని మంత్రి తుమ్మల నాగేశ్వరావ్ తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.