ఉదయగిరి జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు శ్రీమతి షేక్ నూర్జహాన్ తెలిపారు. ఆమె సూచనల మేరకు ఇందిరానగర్ కాలనీలో ఉపాధ్యాయులు షేక్ జరీనా, బీజీఎస్ విద్యావతి అడ్మిషన్ క్యాంపెయిన్ నిర్వహించి 6వ తరగతికి ఇద్దరు విద్యార్థులను చేర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రత్యేకతలు, బోధనా విధానాన్ని తల్లిదండ్రులకు వివరించారు. విద్యా, శారీరక, మానసిక, సామాజిక వికాసానికి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తూ మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. రాబోయే పదో తరగతి ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యం – నూర్జహాన్