586 ఓట్ల మ్యాపింగ్‌తో మండలంలోనే టాప్‌గా నిలిచిన గాదరి మలుసూరమ్మ
తిరుమలాయపాలెం, ఆగస్టు 31:
తిరుమలాయపాలెం మండల పరిధిలోని జల్లేపల్లి గ్రామం పీఎస్–20వ బూత్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా విశేష సేవలు అందించిన బీఎల్ఓ, అంగన్వాడీ టీచర్ గాదరి మలుసూరమ్మను టీఎస్‌జేఏసీ చైర్మన్ మందడి ఇజ్రాయిల్ సోమవారం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మందడి ఇజ్రాయిల్ మాట్లాడుతూ.. జల్లేపల్లి పీఎస్–20 బూత్‌లో మొత్తం 640 ఓట్లను క్రమబద్ధీకరించే ప్రక్రియలో 48 షిఫ్టెడ్, డెత్, డబుల్ ఓట్లను తొలగించి, మిగిలిన 592 ఓట్లలో 586 ఓట్లను విజయవంతంగా మ్యాపింగ్ చేసి మండలంలోనే టాప్‌గా నిలిచిన మలుసూరమ్మను అభినందించారు.
మండలంలో సుమారు 9 వేలకు పైగా ఓటర్లు నాన్–మ్యాపింగ్ జాబితాలో ఉన్నట్లు సమాచారం ఉందని తెలిపారు. ఇందులో సుబ్లేడు 865, పిండిప్రోలు 814 ఓటర్లు నాన్–మ్యాపింగ్ జాబితాలో ఉన్నారని పేర్కొన్నారు.
నాన్–మ్యాపింగ్ జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నికల అధికారులకు సహకరించి, అధికారులు కోరిన ధ్రువపత్రాలను సమర్పించి తమ ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. నోటీసులు అందుకున్న వారు అందులో పేర్కొన్న తేదీ ప్రకారం అవసరమైన ధ్రువపత్రాలతో అధికారుల ఎదుట హాజరు కావాలని, లేనిపక్షంలో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని సూచించారు.
అత్యధిక సంఖ్యలో ఓట్ల మ్యాపింగ్ పూర్తి చేసిన బీఎల్ఓలను మండల అధికారులు సైతం సత్కరిస్తే, అది మిగతా బీఎల్ఓలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఈ సందర్భంగా మండల అధికారులను మందడి ఇజ్రాయిల్ కోరారు.
ఈ కార్యక్రమంలో టీఎస్‌జేఏసీ సభ్యుడు బాజ సత్యనారాయణ, ఐసీడీఎస్ సూపర్వైజర్ సావిత్రి, బీఎల్ఓ ఇర్రి పద్మ, అంగన్వాడీ టీచర్లు చిలకబతిని నిర్మల, పోట్ల రేణుక, రజిని, ఉండేటి జయమ్మ, ఎస్కే షరీఫా, రంగనాయకమ్మ, పద్మకుమారి, ఉండేటి నాగేంద్ర, రావుల ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.


