అనకాపల్లి జిల్లా జులై 29 ( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ )
ఎలమంచిలి మండలంలోని అతిపెద్ద మేజర్ పంచాయతీ ఏటికొప్పాకలో విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ పరిస్థితి అధ్వానంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనం నేటికీ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాకపోవడంతో చుట్టూ పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం, శిథిలావస్థలో ఉన్న నిర్మాణం దర్శనమిస్తోంది. ఫోటోలో కనిపిస్తున్న ఈ పరిస్థితి అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఈ సమస్యపై ఇప్పటివరకు తగిన చర్యలు లేకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్ అందుబాటులో లేకపోవడంతో సచివాలయం–1, సచివాలయం–2లను వేర్వేరుగా అద్దె భవనాల్లో నిర్వహిస్తూ ప్రభుత్వ నిధులతో అద్దెలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని గ్రామస్తులు చెబుతున్నారు.
ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన కేంద్రం ఇలా నిరుపయోగంగా ఉండటం, మరోవైపు అద్దె భవనాలకు ప్రజాధనం ఖర్చు కావడం ఎంతవరకు సమంజసం? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
క్లినిక్‌ను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి
ఏటికొప్పాక గ్రామ ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి విలేజ్ హెల్త్ క్లినిక్‌ను పునరుద్ధరించి వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు. ముఖ్యంగా ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
“ప్రజలకు సేవ చేయాల్సిన భవనం ఇలా నిరుపయోగంగా ఉండాలా? అధికారులు–నాయకులు ఇప్పటికైనా స్పందించాలి” అంటూ ఏటికొప్పాక గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

విలేజ్ హెల్త్ క్లినిక్‌కు గ్రహణం.. ఏటికొప్పాకలో ప్రజారోగ్యానికి ఇదేనా దుస్థితి?
అనకాపల్లి జిల్లా జులై 29 ( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ) ఎలమంచిలి మండలంలోని అతిపెద్ద మేజర్ పంచాయతీ ఏటికొప్పాకలో విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ పరిస్థితి అధ్వానంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనం నేటికీ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాకపోవడంతో చుట్టూ పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం, శిథిలావస్థలో ఉన్న నిర్మాణం దర్శనమిస్తోంది. ఫోటోలో కనిపిస్తున్న ఈ పరిస్థితి అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఈ సమస్యపై ఇప్పటివరకు తగిన చర్యలు లేకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్ అందుబాటులో లేకపోవడంతో సచివాలయం–1, సచివాలయం–2లను వేర్వేరుగా అద్దె భవనాల్లో నిర్వహిస్తూ ప్రభుత్వ నిధులతో అద్దెలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన కేంద్రం ఇలా నిరుపయోగంగా ఉండటం, మరోవైపు అద్దె భవనాలకు ప్రజాధనం ఖర్చు కావడం ఎంతవరకు సమంజసం? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. క్లినిక్‌ను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి ఏటికొప్పాక గ్రామ ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి విలేజ్ హెల్త్ క్లినిక్‌ను పునరుద్ధరించి వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు. ముఖ్యంగా ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. “ప్రజలకు సేవ చేయాల్సిన భవనం ఇలా నిరుపయోగంగా ఉండాలా? అధికారులు–నాయకులు ఇప్పటికైనా స్పందించాలి” అంటూ ఏటికొప్పాక గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

