గ్రామస్తులతో సమావేశమైన నందలూరు ఎస్సై మల్లికార్జున రెడ్డి.
నందలూరు మండలం ఎర్రిపాపాయపల్లెలో ఎస్సై మల్లికార్జున రెడ్డి పర్యటించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. వినాయక చవితి, ఎన్నికలు, నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు. వినాయక చవితిని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, వేడుకలకు ముందుగానే అన్ని అనుమతులు తీసుకోవాలని ఎస్సై సూచించారు.


