డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ 18వ వార్డులో సోమవారం కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రెండేళ్ల నమ్మకం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాన్ని శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ప్రారంభించి, పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి, గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ముమ్మిడివరం నియోజకవర్గంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మరియు ప్రజలకు అందించిన సేవలను వివరించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా అమలు అవుతోందని తెలిపారు.ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందని అన్నారు.అదే స్ఫూర్తితో ముమ్మిడివరం నియోజకవర్గంలో కూడా రహదారులు, తాగునీటి వసతులు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయగలిగామని పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో మరో 15 సంవత్సరాల పాటు విజయవంతంగా పాలన కొనసాగిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతంగా అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు సుంకర పావని, కూటమి సీనియర్ నాయకులు , ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

రెండేళ్ల నమ్మకం సంక్షేమం,అభివృద్ధి ఇంటింటా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు