నిజాంపేట్ ఆగస్టు 15 (పున్నమి)
నిజాంపేట మండల కేంద్రంలోని 4వ అంగన్వాడీ కేంద్రానికి ఆగస్టు 15 సందర్భంగా వ్యాపారి వెల్దుర్తి నగేష్ గౌడ్ చిన్నారుల సౌకర్యార్థం 20 కుర్చీలు, ఆటవస్తులను బహూకరించారు.అలాగే జడ్ చెరువు తాండ సర్పంచ్ బాబు నాయక్, అంగన్వాడి చిన్నారులకు కుర్చీలను అందజేశారు. కుర్చీలను చిన్నారుల అవసరాలను గుర్తించి కుర్చీలు, ఆటవస్తులు అందించిన బాబు నాయక్, నగేష్ గౌడ్, లను అంగన్వాడీ కేంద్రం సభ్యులు శాలువాతో సన్మానించి అభినందించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ దుర్గేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.


