అరకులోయ మండలం బొండం పంచాయతీ పరిధిలోని జయంతి వలస, రేగా, గూడ గ్రామాల్లో సుమారు 50 ఎకరాల సాగుభూమికి నీరందించేలా కొత్త చెక్‌డ్యామ్‌ను వెంటనే మంజూరు చేసి నిర్మించాలని సీపీఎం డిమాండ్ చేసింది. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి. ఉమామహేశ్వరరావు, గిరిజన సంఘం మండల కార్యదర్శి జి. బుజ్జిబాబు, సీపీఎం నాయకులు జి. చిన్నబాబు, టి. జోషిబాబు గ్రామాల్లో పర్యటించి 2014 హుదూద్ తుఫానులో కొట్టుకుపోయిన చెక్‌డ్యామ్‌ను పరిశీలించారు. గతంలో నాణ్యత లోపాలతో నిర్మించడం వల్లే చెక్‌డ్యామ్ కొట్టుకుపోయిందని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. చెక్‌డ్యామ్ లేకపోవడంతో రైతులు సాగునీటి కొరతతో పంటలు నష్టపోతున్నారని తెలిపారు. పదేళ్లుగా అధికారులకు, జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. వెంటనే నాణ్యత ప్రమాణాలతో కొత్త చెక్‌డ్యామ్‌కు నిధులు మంజూరు చేయాలని, లేకుంటే రైతులతో కలిసి మండల HMI కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు.

50 ఎకరాల సాగుకు చెక్‌డ్యామ్ వెంటనే మంజూరు చేయాలి: సీపీఎం