జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్.
*తిరుపతి, ఆగస్టు 15: పున్నమి ప్రతినిధి
80వ స్వతంత్ర దినోత్సవాన్ని విజయంతం చేసిన అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ధన్యవాదాలు తెలిపారు.
శనివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తేనెటి విందు కార్యక్రమంను జిల్లా ఎస్పి ఎల్. సుబ్బరాయుడు తో కలిపి నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేడు నిర్వహించిన 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా యంత్రాంగం సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంప్రదాయాన్ని ఇదే విధంగా కొనసాగించాలని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను ఇదే సమన్వయం, ఉత్సాహంతో నిర్వహించాలని అధికారులను కోరారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులకు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థిని,విద్యార్థులకు మొమెంటో లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవింద రావు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఎం . జయ కృష్ణ, తుడా చైర్మన్ డాలర్ దివాకర్, డీఆర్ఓ నరసింహులు, క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్,, తిరుపతి, శ్రీకాళహస్తి, ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
………….
డిఐపిఆర్ఓ, తిరుపతి






