నేల కొండపల్లి / ఖమ్మం
నేలకొండపల్లి మండల కేంద్రంలోని గ్రామ సెంటర్‌లో భారతీయ కిసాన్ సంఘ్ (BKS) ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు సోమశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో BKS ఖమ్మం జిల్లా అధ్యక్షులు పగడవరకు శ్రీనివాస్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారం కోసం భారతీయ కిసాన్ సంఘ్ నిరంతరం పోరాడుతోందన్నారు. జిల్లాలో అనేక రైతు సమస్యల పరిష్కారానికి సంఘం కృషి చేసిందని తెలిపారు. ప్రతి పంటకు రైతులకు లాభసాటి ధర కల్పించాలని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తోందన్నారు. కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.



