Sunday, 23 August 2026
  • Home  
  • 3వ వైజాగ్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ అట్టహాసంగా ప్రారంభం
- విశాఖపట్నం

3వ వైజాగ్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ అట్టహాసంగా ప్రారంభం

విశాఖపట్నం: (పున్నమి ప్రతినిది )ఆగస్టు 22 విశాఖపట్నం స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం వేదికగా డ్రాగన్స్ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ సీయోన్ సీహెచ్. సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో 3వ వైజాగ్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్ అంగరంగ వైభవంగా నిర్వహించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ కరాటే ఛాంపియన్‌షిప్‌లో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. చిన్నారులు, యువ క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనడంతో స్టేడియం క్రీడా సందడితో మార్మోగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాంశీ సుమన్ తల్వార్ హాజరై క్రీడాకారులను ఉద్దేశించి ప్రేరణాత్మక సందేశాన్ని అందించారు. “కరాటే కేవలం ఆత్మరక్షణ విద్య మాత్రమే కాదు.. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో జీవితంలో ముందుకు సాగే మార్గాన్ని చూపించే గొప్ప క్రీడ” అని ఆయన పేర్కొన్నారు. యువత క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అలాగే హాంశీ రాజేష్ అగర్వాల్, కరాటే రంగ ప్రముఖులు కా ర్యక్రమంలో పాల్గొని క్రీడాకారులను అభినందించారు. కరాటే క్రీడకు విశాఖలో మరింత ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో డ్రాగన్స్ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఛాంపియన్‌షిప్ విజయవంతంగా కొనసాగుతోంది.

విశాఖపట్నం: (పున్నమి ప్రతినిది )ఆగస్టు 22
విశాఖపట్నం స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం వేదికగా డ్రాగన్స్ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ సీయోన్ సీహెచ్. సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో 3వ వైజాగ్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్ అంగరంగ వైభవంగా నిర్వహించారు.

జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ కరాటే ఛాంపియన్‌షిప్‌లో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. చిన్నారులు, యువ క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనడంతో స్టేడియం క్రీడా సందడితో మార్మోగింది.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాంశీ సుమన్ తల్వార్ హాజరై క్రీడాకారులను ఉద్దేశించి ప్రేరణాత్మక సందేశాన్ని అందించారు. “కరాటే కేవలం ఆత్మరక్షణ విద్య మాత్రమే కాదు.. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో జీవితంలో ముందుకు సాగే మార్గాన్ని చూపించే గొప్ప క్రీడ” అని ఆయన పేర్కొన్నారు. యువత క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

అలాగే హాంశీ రాజేష్ అగర్వాల్, కరాటే రంగ ప్రముఖులు కా ర్యక్రమంలో పాల్గొని క్రీడాకారులను అభినందించారు.

కరాటే క్రీడకు విశాఖలో మరింత ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో డ్రాగన్స్ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఛాంపియన్‌షిప్ విజయవంతంగా కొనసాగుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.