అనకాపల్లి జిల్లా 29 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్) :
ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మామిడివాడ గ్రామంలో రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రోడ్లు డెవలప్‌మెంట్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రైతుల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, నాణ్యమైన విత్తనాలతో పాటు రైతులకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. రైతు సంక్షేమమే రాష్ట్రాభివృద్ధికి పునాదిగా భావించి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ అన్నం బాబూజీ, మండల ప్రెసిడెంట్ రాజన్న శేషు, కొనగల భాస్కర్, సేపరశెట్టి శ్రీను, కరణం నగేష్, సేనాపతి కనకరాజు నాయుడు, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

