Sunday, 23 August 2026
  • Home  
  • *ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అందించకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం.*
- తిరుపతి

*ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అందించకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం.*

*హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్.* తిరుపతి ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి నగరంలోని హోటల్స్ నందు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అందించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ హెచ్చరించారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు శనివారం నగరంలోని పలు హోటల్స్ లో హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా కపిల తీర్థం వద్దగల A 2B హోటల్ ను తనిఖీ చేశారు. అందులో సరైన పారిశుధ్య నిర్వహణ లేకపోవడం, వారి హోటల్ లోని కాలువల్లో విచ్చలవిడిగా వ్యర్థాలను వేయడం వలన వెస్ట్ వాటర్ ప్రవాహనికి ఆటంకం కల్గి దుర్వాసన రావడం, హోటల్ నుండి వచ్చే వ్యర్థాల వలన మునిసిపల్ డ్రైనేజీ బ్లాక్ అవడం మరియు ఆహరపదార్దాలు నిలువవుంచే ప్రిజ్ తుప్పు పట్టి ఉండడం గమనించి మునిసిపల్ కార్పొరేషన్ చట్టం 1955 ను అనుసరించి వారికి పెనాలిటీ వేసి నోటీసులు జారీ చేశారు. అనంతరం రైల్వే స్టేషన్ ముందర వున్న హోటల్స్ ను ఆర్టీసీ బస్టాండ్ ముందున్న హోటల్స్ ను తనిఖీ చేశారు. అందులో పలు హోటల్స్ నందు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కుళ్ళిపోయిన ఆలుగడ్డలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, మరియు వండి మిగిలిన ఆహార పదార్థాలు ఫ్రిజ్లో సరైన ఉష్నోగ్రత పాటించక నిలువ చేసి ఉండడం, హోటల్స్ నందు కుక్కలు, పిల్లులు తిరుగుతుండడం గుర్తించారు. అవి అపరిశుభ్రతను కలిగించి, ప్రజా వినియోగానికి పనికిరానివిగా గుర్తించారు. సదురు హోటల్ లలో రైల్వె స్టేషన్ వద్ద పూర్తిగా నాణ్యత ప్రమాణాలు పాటించని పంజాబీ డాబా, ఇతర ఫాస్ట్ ఫుడ్ హోటళ్ళను సీజ్ చేశారు. మరో నాలుగు హోటల్స్ పై ఫుడ్ సెప్టీ అధికారులు కేసులు పెట్టడం జరిగినది మొత్తంగా 500 కేజీల పాడైనా ఆహర పదార్దాలను స్వాదినం చేసుకున్నారు. మిగతా హోటల్స్ అన్నింటికీ లోపాలను సరి చేసుకోవలసిందిగా తెలియజేస్తూ నోటీసులు జారీ చేసి, పెనాల్టీ విధించారు. వారికి ఇచ్చిన గడువు లోపల వారి లోపాలను సరి చేయకపోయినట్లయితే తదుపరి నోటీసు ఇవ్వకుండానే హోటల్స్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. తిరుపతి యాత్ర స్థలమైనందున భక్తులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించేలా నిత్యం పర్యవేక్షణ చేయాలని కమిషనర్ ఎం. జయకృష్ణ ఆదేశాల మేరకు నగరంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వున్ననందున అనేకమంది యాత్రికులు ప్రతిరోజు దైవదర్శనానికి వచ్చి వారి తొందరలో ఏదో ఒక చోట తిని పోదాం అనుకుంటున్న సమయంలో యాత్రికులకు ఇలాంటి అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను సరఫరా చేయడం పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిశుభ్రమైన వాతావరణంలో భక్తులకు ఆహార పదార్థాలు అందించాలని తెలిపారు. వంట తయారీకి మంచి సరుకులు వినియోగించి కల్తీ లేని నూనెలు వినియోగించి నాణ్యమైన ఆహార పదార్థాలను వేడివేడిగా సరఫరా చేయవలసిందిగా ఆదేశించారు. గుర్తించిన లోపాలను వెంటనే సరిచేసి ప్రజలకు యాత్రికులకు నాణ్యమైన ఆహారపదార్థలు అందించాలని ఆదేశించారు. నగరంలో నాణ్యమైన ఆహార పదార్థాలు వినియోగం విషయంలో ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించిన హోటల్స్ పై కఠిన చర్యలు తీసుకొని వారి ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 ననుసరించి చర్యలు తీసుకొన కనబడునని హెచ్చరించారు. తదుపరి కూడా రెగ్యులర్గా అన్ని హోటల్స్ నందు నాణ్యత పరిమాణాల విషయంలో రాజీ లేకుండా తనిఖీలు నిర్వహించడం,లోపాలు ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకొని యాత్రికులకు, ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

*హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్.*

తిరుపతి ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి

నగరంలోని హోటల్స్ నందు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అందించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ హెచ్చరించారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు శనివారం నగరంలోని పలు హోటల్స్ లో హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా కపిల తీర్థం వద్దగల A 2B హోటల్ ను తనిఖీ చేశారు. అందులో సరైన పారిశుధ్య నిర్వహణ లేకపోవడం, వారి హోటల్ లోని కాలువల్లో విచ్చలవిడిగా వ్యర్థాలను వేయడం వలన వెస్ట్ వాటర్ ప్రవాహనికి ఆటంకం కల్గి దుర్వాసన రావడం, హోటల్ నుండి వచ్చే వ్యర్థాల వలన మునిసిపల్ డ్రైనేజీ బ్లాక్ అవడం మరియు ఆహరపదార్దాలు నిలువవుంచే ప్రిజ్ తుప్పు పట్టి ఉండడం గమనించి మునిసిపల్ కార్పొరేషన్ చట్టం 1955 ను అనుసరించి వారికి పెనాలిటీ వేసి నోటీసులు జారీ చేశారు. అనంతరం రైల్వే స్టేషన్ ముందర వున్న హోటల్స్ ను ఆర్టీసీ బస్టాండ్ ముందున్న హోటల్స్ ను తనిఖీ చేశారు. అందులో పలు హోటల్స్ నందు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కుళ్ళిపోయిన ఆలుగడ్డలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, మరియు వండి మిగిలిన ఆహార పదార్థాలు ఫ్రిజ్లో సరైన ఉష్నోగ్రత పాటించక నిలువ చేసి ఉండడం, హోటల్స్ నందు కుక్కలు, పిల్లులు తిరుగుతుండడం గుర్తించారు. అవి అపరిశుభ్రతను కలిగించి, ప్రజా వినియోగానికి పనికిరానివిగా గుర్తించారు. సదురు హోటల్ లలో రైల్వె స్టేషన్ వద్ద పూర్తిగా నాణ్యత ప్రమాణాలు పాటించని పంజాబీ డాబా, ఇతర ఫాస్ట్ ఫుడ్ హోటళ్ళను సీజ్ చేశారు. మరో నాలుగు హోటల్స్ పై ఫుడ్ సెప్టీ అధికారులు కేసులు పెట్టడం జరిగినది మొత్తంగా 500 కేజీల పాడైనా ఆహర పదార్దాలను స్వాదినం చేసుకున్నారు. మిగతా హోటల్స్ అన్నింటికీ లోపాలను సరి చేసుకోవలసిందిగా తెలియజేస్తూ నోటీసులు జారీ చేసి, పెనాల్టీ విధించారు. వారికి ఇచ్చిన గడువు లోపల వారి లోపాలను సరి చేయకపోయినట్లయితే తదుపరి నోటీసు ఇవ్వకుండానే హోటల్స్ సీజ్ చేస్తామని హెచ్చరించారు.

తిరుపతి యాత్ర స్థలమైనందున భక్తులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించేలా నిత్యం పర్యవేక్షణ చేయాలని కమిషనర్ ఎం. జయకృష్ణ ఆదేశాల మేరకు నగరంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వున్ననందున అనేకమంది యాత్రికులు ప్రతిరోజు దైవదర్శనానికి వచ్చి వారి తొందరలో ఏదో ఒక చోట తిని పోదాం అనుకుంటున్న సమయంలో యాత్రికులకు ఇలాంటి అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను సరఫరా చేయడం పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిశుభ్రమైన వాతావరణంలో భక్తులకు ఆహార పదార్థాలు అందించాలని తెలిపారు. వంట తయారీకి మంచి సరుకులు వినియోగించి కల్తీ లేని నూనెలు వినియోగించి నాణ్యమైన ఆహార పదార్థాలను వేడివేడిగా సరఫరా చేయవలసిందిగా ఆదేశించారు. గుర్తించిన లోపాలను వెంటనే సరిచేసి ప్రజలకు యాత్రికులకు నాణ్యమైన ఆహారపదార్థలు అందించాలని ఆదేశించారు. నగరంలో నాణ్యమైన ఆహార పదార్థాలు వినియోగం విషయంలో ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించిన హోటల్స్ పై కఠిన చర్యలు తీసుకొని వారి ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 ననుసరించి చర్యలు తీసుకొన కనబడునని హెచ్చరించారు. తదుపరి కూడా రెగ్యులర్గా అన్ని హోటల్స్ నందు నాణ్యత పరిమాణాల విషయంలో రాజీ లేకుండా తనిఖీలు నిర్వహించడం,లోపాలు ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకొని యాత్రికులకు, ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.