సత్తుపల్లి/ ఖమ్మం
రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని TGIDC చైర్మన్ గౌ. శ్రీ మువ్వా విజయబాబు సోదరీమణులతో రాఖీ కట్టించుకుని వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సోదరీమణుల ప్రేమ, ఆప్యాయతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వారి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఆనందం నిండాలని ఆకాంక్షించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలను కుటుంబ సభ్యులు, సోదరీమణులతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. రాఖీ పండుగ సోదరసోదరీమణుల మధ్య ప్రేమానురాగాలను మరింత బలోపేతం చేస్తుందని మువ్వా విజయబాబు పేర్కొన్నారు.



