సీతారామపురం పున్నమి ప్రతినిధి ఆగస్టు 23న
సీతారామపురం మండలం బసినేనిపల్లి గ్రామంలో నిర్వహించిన “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంలో గౌరవ ఉదయగిరి శాసన సభ్యులు శ్రీ కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే శ్రీ కంభం విజయరామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలు, అవసరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. ముఖ్యంగా పేదలు, మహిళలు, రైతులు, వృద్ధులు, విద్యార్థులు, బడుగు–బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వివరించారు “ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడమే మా ప్రభుత్వ లక్ష్యం. సంక్షేమం ప్రతి అర్హుడికి అందాలి… అభివృద్ధి ప్రతి గ్రామానికి చేరాలి. ప్రతి కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు

సంక్షేమం ప్రతి గడపకు.. అభివృద్ధి ప్రతి గ్రామానికి : ఎమ్మెల్యే కాకర్ల సురేష్
సీతారామపురం పున్నమి ప్రతినిధి ఆగస్టు 23న సీతారామపురం మండలం బసినేనిపల్లి గ్రామంలో నిర్వహించిన “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంలో గౌరవ ఉదయగిరి శాసన సభ్యులు శ్రీ కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే శ్రీ కంభం విజయరామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలు, అవసరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. ముఖ్యంగా పేదలు, మహిళలు, రైతులు, వృద్ధులు, విద్యార్థులు, బడుగు–బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వివరించారు “ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడమే మా ప్రభుత్వ లక్ష్యం. సంక్షేమం ప్రతి అర్హుడికి అందాలి… అభివృద్ధి ప్రతి గ్రామానికి చేరాలి. ప్రతి కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు

