వింజమూరు : నెల్లూరు జిల్లా వింజమూరు జగనన్న కాలనీ వెనుక మామిడి తోటలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి. ముగ్గురు అరెస్ట్, నగదు స్వాధీనం
వింజమూరు: నెల్లూరు జిల్లా వింజమూరు పరిధిలోని జగనన్న కాలనీ వెనుక మామిడి తోటలో పేకాట నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు.వారి వద్ద నుంచి రూ.5,200 నగదు,పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న ముగ్గురిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టినట్లు వింజమూరు ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు. వింజమూరు పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, పేకాట వంటి జూద కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.


