ఆత్మకూరు : నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని 21 పంచాయతీలకు పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా ప్రచురణ. అభ్యంతరాలకు ఆగస్టు 26 వరకు గడువు.
ఆత్మకూరు : ఆత్మకూరు మండలంలోని పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా ప్రచురణ…..గ్రామ పంచాయితీల ఎన్నికలకు సంబంధించి సర్పంచులు వార్డు మెంబర్లు ఎన్నిక గురించి మండలంలోని 21 గ్రామపంచాయతీ , ఆత్మకూరు మండల పరిషత్, తాసిల్దార్ కార్యాలయాల్లో ప్రచురణ. రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని 21 గ్రామపంచాయతీలోని సర్పంచులు,వార్డు మెంబర్ల ఎన్నిక కొరకు, పోలింగ్ నిమిత్తం “పోలింగ్ స్టేషన్ల ముసాయిదా ఓటర్ల జాబితా”ను ఆదివారం(23.8.26)న ఆత్మకూరు మండలంలోని 21 గ్రామపంచాయతీల నందు, మండల ప్రజాపరిషత్ కార్యాలయము ఆత్మకూరు, మండల తహసిల్దార్ కార్యాలయము ఆత్మకూరు నందు ప్రచురించడం జరిగిందనీ మండల అభివృద్ధి అధికారి రఫీ ఖాన్ తెలిపారు. ఆదివారం ఆయన మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. మండలంలోని అన్ని రాజకీయ పక్షాల కన్వీనర్లకు, నాయకులకు,ఓటర్లకు ఈ సందర్భంగా తెలియజేశారు. 2026 సంవత్సరం ముసాయిదా ఓటర్ల జాబితా గురించి ఏదైనా అభ్యంతరాలు , సలహాలు ఉంటే తేదీ 24.8.26 నుండి తేదీ 26.8.26 సాయంత్రం ఐదు గంటల లోపల మండల ప్రజాపరిషత్ కార్యాలయము, ఆత్మకూరు నందు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి వద్ద తెలియజేయాలని ఎంపీడీవో పి రఫీ ఖాన్ తెలిపారు.


