Monday, 22 June 2026
  • Home  
  • NGKL: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు వ్యాఖ్యలు తగవు : మంత్రి సీతక్క*
- నాగర్‌కర్నూల్

NGKL: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు వ్యాఖ్యలు తగవు : మంత్రి సీతక్క*

సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు వ్యాఖ్యలు తగవని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంఎల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణతో కలిసి మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లకాలంలో పది లక్షల ఇండ్లు ఇవ్వలేక పోయిందని, కేవలం 80వేల ఇండ్లు మాత్రమే ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్, బీజెపీ సీఎం రేవంత్ రెడ్డిని వ్యక్తిగత హననానికి పాల్పడేలా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. అబద్దానికి ఆరడుగులు అర్థం హరీష్ రావు అన్నారు‌. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని,బీఆర్ఎస్ ప్రభుత్వం 4వేల కోట్ల వడ్డీ డబ్బులు ఎగగొట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో లేని హామీలు అమలు చేశామన్నారు.హరీష్…చేతనైతేనిజం ఒక్కటి ఒప్పుకో అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి బదులు అప్పులు చేశాం, వడ్డీలు చేశాం అని వాస్తవం అని చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలుసన్నారు. హరీష్ ముందు కవిత అడుగే ప్రశ్నలకు సమాధానం చెప్పని అన్నారు.కేటీఆర్, హరీష్ రావులు రేవంత్ రెడ్డి సీఎం అవ్వడాన్ని తట్టుకోలేకపోతున్నారు. నల్లమల ప్రాంతాన్ని కించపరిచేలా మాట్లాడటం తగదు అన్నారు. నల్లమల పౌరుషం, శౌర్యం రేవంత్ సొంతం అన్నారు. హైదరాబాదుకు మెట్రో రాకుండా చేస్తున్నారన్నారు.పరిస్థితులను బట్టి రైతులు పంటలను పండిస్తారని, ఈ రెండేళ్లలో రికార్డు స్థాయిలో పంటల దిగుబడి జరిగితే అదేస్థాయిలో కొనుగోళ్లు చేపట్టామన్నారు.

సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు వ్యాఖ్యలు తగవని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విమర్శించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంఎల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణతో కలిసి మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లకాలంలో పది లక్షల ఇండ్లు ఇవ్వలేక పోయిందని, కేవలం 80వేల ఇండ్లు మాత్రమే ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్, బీజెపీ సీఎం రేవంత్ రెడ్డిని వ్యక్తిగత హననానికి పాల్పడేలా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు.
అబద్దానికి ఆరడుగులు అర్థం హరీష్ రావు అన్నారు‌. కాంగ్రెస్ ప్రభుత్వం
మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని,బీఆర్ఎస్ ప్రభుత్వం 4వేల కోట్ల వడ్డీ డబ్బులు ఎగగొట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం
మేనిఫెస్టోలో లేని హామీలు అమలు చేశామన్నారు.హరీష్…చేతనైతేనిజం ఒక్కటి ఒప్పుకో అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి బదులు
అప్పులు చేశాం, వడ్డీలు చేశాం అని వాస్తవం అని చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలుసన్నారు. హరీష్ ముందు కవిత అడుగే ప్రశ్నలకు సమాధానం చెప్పని అన్నారు.కేటీఆర్, హరీష్ రావులు రేవంత్ రెడ్డి సీఎం అవ్వడాన్ని తట్టుకోలేకపోతున్నారు. నల్లమల ప్రాంతాన్ని కించపరిచేలా మాట్లాడటం తగదు అన్నారు. నల్లమల పౌరుషం, శౌర్యం రేవంత్ సొంతం అన్నారు. హైదరాబాదుకు
మెట్రో రాకుండా చేస్తున్నారన్నారు.పరిస్థితులను బట్టి రైతులు పంటలను పండిస్తారని, ఈ రెండేళ్లలో
రికార్డు స్థాయిలో పంటల దిగుబడి జరిగితే అదేస్థాయిలో కొనుగోళ్లు చేపట్టామన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.