ఆనందపురం మండలంలో పంట నష్టం.. రైతన్నలకు కన్నీటి కష్టం
విశాఖపట్నం జిల్లా, ఆనందపురం మండలం, (పున్నమి ప్రతినిధి) సెప్టెంబర్ 24:
ఆనందపురం మండలం పెద్దిపాలెంలో ఆర్నబ్ తుఫాన్ కారణంగా అరటి తోటలు నేలకొరిగాయి. ఈదురుగాలుల ధాటికి చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
పెద్దిపాలెం గ్రామానికి చెందిన కొల్లాబట్టి ప్రకాష్ అనే రైతుకు చెందిన సుమారు 40 సెంట్ల భూమిలో ఉన్న అరటి తోట తుఫాన్ కారణంగా పూర్తిగా నేలపాలైంది. దీంతో పంటపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
నష్టాన్ని పరిశీలించేందుకు గుడిలోవ నీటి సంఘం వైస్ చైర్మన్ ముదిలీ చిన్నయ్య పాత్రుడు రైతు భరోసా అగ్రికల్చర్ అసిస్టెంట్ రేఖతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టాన్ని నమోదు చేసి, వివరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
పెద్దిపాలెం గ్రామంలో పంట నష్టం పొందిన మరికొందరు రైతులు కూడా ఉన్నారని, మిగతా రైతులకు కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి, వారికి జరిగిన పంట నష్టాన్ని నమోదు చేసి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
**తుఫాన్ దెబ్బకు నేలకొరిగిన అరటి తోటలు..
రైతన్నల కళ్లలో కన్నీళ్లు!**
పంట నష్టంపై అధికారులు సమగ్రంగా అంచనా వేసి, అర్హులైన రైతులకు త్వరితగతిన సహాయం అందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

