ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘నేతన్నల సేవలో’ పథకం ద్వారా రూ.25 వేల ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం పేర్కొంది. అయితే గత ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో 3,500 మంది చేనేతలకు లబ్ధి చేకూరగా, ప్రస్తుతం 2,636 మందికే పరిమితం చేయడం వల్ల సుమారు 900 మంది అర్హులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. చేనేత పెన్షన్‌ను పునరుద్ధరించడంతో పాటు, చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేయాలని లేదా రీయింబర్స్ చేయాలని కోరింది. అలాగే రిజర్వేషన్ల అమలు, నెల్లూరు ఆప్కో స్థలాన్ని చేనేతల ప్రయోజనాలకు వినియోగించాలని, మగ్గం ఉన్న ప్రతి నేత కార్మికుడికి ఈ పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేసింది

నేతన్నల సేవలో అందరికీ లబ్ధి