శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఆకట్టుకున్న చిన్నారుల శ్రీకృష్ణ అవతారం
పున్నమి ప్రతినిధి
కడప, సెప్టెంబర్ 4: కడప నగరంలోని ద్వారకా నగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకర మహేంద్ర, కత్తి కార్తీక్ చిన్నారులు శ్రీకృష్ణుని అవతారంలో ప్రత్యేక వేషధారణతో ఆకట్టుకున్నారు.
శ్రీకృష్ణుడి రూపంలో చిన్నారులు ఎంతో అందంగా ముస్తాబై, వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారి వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. చిన్నారులను చూసి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణలో పాల్గొనడం ద్వారా పండుగ వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారింది.





