తిరుచానూరు, సెప్టెంబర్ 4 పున్నమి ప్రతినిధి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయాల్లోని శ్రీ బలరామకృష్ణ స్వామివారి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. జన్మాష్టమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. ఉదయం శ్రీ ఉభయ దేవేరుల సమేత శ్రీకృష్ణ బలరామ స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం శ్రీ ఉభయ దేవేరుల సమేత శ్రీకృష్ణ బలరామ స్వామివారిని బంగారు తిరుచ్చిపై కొలువుదీర్చి ఆలయ మాడవీధుల్లో వైభవంగా ఊరేగించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉట్టి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలతో ఆలయ పరిసరాలు భక్తుల సందడి, ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి. ఈ కార్యక్రమలల్లో ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, ఏవీఎస్ఓ శ్రీహరిరావు, సూపరింటెండెంట్లు రమేష్, సురేష్, ముని చెంగల్రాయులు, ఇన్‌స్పెక్టర్లు చలపతి, లక్ష్మీకాంత్, ఆలయ అర్చకులు బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
తిరుచానూరు, సెప్టెంబర్ 4 పున్నమి ప్రతినిధి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయాల్లోని శ్రీ బలరామకృష్ణ స్వామివారి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. జన్మాష్టమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. ఉదయం శ్రీ ఉభయ దేవేరుల సమేత శ్రీకృష్ణ బలరామ స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం శ్రీ ఉభయ దేవేరుల సమేత శ్రీకృష్ణ బలరామ స్వామివారిని బంగారు తిరుచ్చిపై కొలువుదీర్చి ఆలయ మాడవీధుల్లో వైభవంగా ఊరేగించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉట్టి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలతో ఆలయ పరిసరాలు భక్తుల సందడి, ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి. ఈ కార్యక్రమలల్లో ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, ఏవీఎస్ఓ శ్రీహరిరావు, సూపరింటెండెంట్లు రమేష్, సురేష్, ముని చెంగల్రాయులు, ఇన్‌స్పెక్టర్లు చలపతి, లక్ష్మీకాంత్, ఆలయ అర్చకులు బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు.

