తిరుచానూరు, సెప్టెంబర్ 4 పున్నమి ప్రతినిధి
శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి శిల్పారామంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుచానూరుకు చెందిన సహానా మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ కళాకారులు సంగీత వాయిద్యాల కచేరీ నిర్వహించారు. గురువు శశిధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొని తమ సంగీత ప్రతిభను ప్రదర్శించారు. వయోలిన్, కీబోర్డ్, గిటార్, వేణువు తదితర వాయిద్యాలతో కళాకారులు పలు భక్తి గీతాలను ఆలపించారు. ‘ఎందరికీ అభయమ్ము’, ‘కాలభైరవాష్టకం’, ‘నారాయణాచ్యుత’, ‘గరుడగమన’, ‘జగదపు నా చనవుల’, ‘పిడికిట తలంబ్రాల’, ‘అచ్యుతం కేశవం’, ‘షోడశ కళానిధి’, ‘పాహి రామ’, ‘రారా వేణుగోపాల’, ‘చాలద హరి నామ’, ‘జయ జనార్ధన’ తదితర గీతాలను సంగీత వాయిద్యాల ద్వారా వినిపించారు. ఈ కార్యక్రమంలో వయోలిన్‌పై సహానా, విన్నీ కరణం, అక్షర, అనూష, అశ్వధ్, విజయ్, కౌశిక్; కీబోర్డ్‌పై గిరీష్, హనీష్, ఇషాన్వి, దుర్గా శ్రీనివాస్, ఆశ్రిత్, కేదార్, శశి, సర్వేష్, ప్రసన్న వెంకటేష్, పాంచజన్య, వేదాంత్, హర్ష, శ్రీవత్స, రుధ్రాంక్ష్, నిషిధా, యాషిక; గిటార్‌పై శ్రీప్రియ, శ్రీరామ్, ఆశ్రిత్; వేణువుపై రిషి, శ్రీపధ్ పాల్గొన్నారు. బాలాజీ కీబోర్డ్‌పై, మురళి మెత్తలపై సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో శిల్పారామం పరిపాలన అధికారి ఖదీర్‌తో పాటు సిబ్బంది తేజ, పప్పీ, రాధాకృష్ణ, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



