శ్రీ కాళహస్తి, జులై 18, (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపదీ సమేత ధర్మరాజు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఆలయ అధికారులు, వేద పండితుల ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు నగర సంకీర్తన, మంగళవాయిద్యాల నడుమ ఘనంగా నగరోత్సవాన్ని నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ద్రౌపదీ దేవి, ధర్మరాజు స్వామివారి ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించగా, మార్గమంతా భక్తులు కర్పూర హారతులు సమర్పించి భక్తిపూర్వకంగా దర్శించుకున్నారు. వేదఘోషలు, మంగళవాయిద్యాల మధ్య సాగిన ఈ ఊరేగింపు ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, సేవకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీకాళహస్తిలో వైభవంగా ద్రౌపదీ–ధర్మరాజు స్వామివారి నగరోత్సవం