విజయవాడ, జనవరి 27:
అఖిల భారత యాదవ మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలో కీలక నియామకం జరిగింది. సంస్థ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ (రాజకీయ వ్యవహారాల కమిటీ – పిఎసి ) చైర్మన్‌గా విజయవాడకు చెందిన ప్రముఖ నాయకులు శ్రీ కొలుసు మోహన్ యాదవ్ నియమితులయ్యారు.
ఆదివారం విజయవాడలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చింకా నారాయణరావు యాదవ్ గారు మోహన్ యాదవ్‌కు నియామక పత్రాన్ని అందజేసి, బాధ్యతలు అప్పగించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు చింకా నారాయణరావు యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యాదవులను రాజకీయంగా చైతన్యపరచడానికి, సామాజికంగా వారి హక్కుల కోసం పోరాడటానికి మోహన్ యాదవ్ గారి అనుభవం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో యాదవ సామాజిక వర్గం రాజకీయంగా ఎదిగేందుకు ఈ కమిటీ దిశానిర్దేశం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
నూతన చైర్మన్ కొలుసు మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఇంతటి బాధ్యతాయుతమైన పదవిని అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులకు మరియు కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యాదవుల ఐక్యత కోసం, వారి రాజకీయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం ప్రతినిధులు పాల్గొని మోహన్ యాదవ్‌ను ఘనంగా సన్మానించారు.
ప్రచురణార్థం:
చింకా నారాయణరావు యాదవ్
రాష్ట్ర అధ్యక్షులు, అఖిల భారత యాదవ మహాసభ, ఆంధ్రప్రదేశ్.


