శ్రీ కాళహస్తి, జులై 18, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు, మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. స్థానిక శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మున్సిపల్ సిబ్బందితో కలిసి స్వయంగా పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ..పరిశుభ్రమైన గ్రామాలు, పట్టణాల నిర్మాణమే స్వర్ణ ఆంధ్ర ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పరిశుభ్రమైన పరిసరాలు ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా తమ సొంత బాధ్యతగా భావించి, పరిశుభ్రమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా, జూలై నెలకు సంబంధించి ‘ఎన్యుమరేషన్ ఆఫ్ బల్క్ వేస్ట్ జనరేటర్స్’ అంశంపై అవగాహన కల్పించారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వాణిజ్య సముదాయం, హాస్టళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, దేవాలయాలు, మార్కెట్లు, పాఠశాలల నిర్వాహకులు తమ సంస్థలను సిపిసిబి (CPCB) పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు.కార్యక్రమం అనంతరం మున్సిపల్ కమిషనర్ కె.వి. కృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. వ్యాపార, వాణిజ్య సంస్థలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, ఉత్పత్తి అయ్యే చెత్తను తడి, పొడి వ్యర్థాలుగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొని పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు.

శ్రీకాళహస్తిలో ముమ్మరంగా స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం