శ్రీ కాళహస్తి, జులై 18, (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన టాక్సీ డ్రైవర్ ఉమాయూన్ బాషా కనిపించకుండా పోయిన ఘటనపై జనసేన పార్టీ నాయకుడు దండి నరేంద్ర తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్త సలీమ్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. శ్రీకాళహస్తికి చెందిన గిరి అనే వ్యక్తి అభ్యర్థన మేరకు కారును అప్పగించేందుకు ఉమాయూన్ బాషా ఒంగోలు వెళ్లారు. పని పూర్తి చేసుకుని పారితోషికం తీసుకున్న అనంతరం, జూలై 16 గురువారం సాయంత్రం 7:15 గంటలకు ఇంటికి ఫోన్ చేసి, శ్రీకాళహస్తి తిరిగి రావడానికి బస్సు కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అయితే ఆ తర్వాత ఆయన నుంచి ఎలాంటి సంప్రదింపులు లేవు. జూలై 17 మధ్యాహ్నం 1:30 గంటలకు కుటుంబ సభ్యులు చివరిసారిగా ఫోన్ చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. అప్పటి నుంచి ఆచూకీ తెలియకపోవడంతో భార్య, కుమార్తె తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా ఆయనకు బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలు ఉండటంతో కుటుంబ సభ్యుల భయం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పిన దండి నరేంద్ర, జనసేన పార్టీ తరఫున పూర్తి నైతిక మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఉదంతాన్ని వెంటనే వన్‌టౌన్ సీఐ వెంకటేష్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన అత్యంత వేగంగా స్పందించి దర్యాప్తునకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు. ఉమాయూన్ బాషా ఆచూకీ కోసం అవసరమైన సహాయాన్ని అందించేందుకు ఎప్పుడైనా సంప్రదించవచ్చని సీఐ భరోసా ఇచ్చారని, పోలీస్ శాఖ తక్షణ స్పందన, బాధ్యతాయుతమైన వైఖరి అభినందనీయమని దండి నరేంద్ర పేర్కొన్నారు. సీఐ సూచనల మేరకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఉమాయూన్ బాషా క్షేమంగా త్వరలోనే ఇళ్లకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

తప్పిపోయిన టాక్సీ డ్రైవర్ ఆచూకీ కోసం చర్యలు-జనసేన నాయకుడు దండి నరేంద్ర