శ్రీ కాళహస్తి, జులై 18, (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీకాళహస్తి జనసేన పార్టీ నాయకులు, డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమ నిర్వాహకులు పేట చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం తొట్టంబేడు మండలం విరూపాక్షపురం గిరిజన కాలనీలో ఓ పేద కుటుంబానికి మానవతా దృక్పథంతో ఆర్థిక సాయం అందించారు. నలుగురు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు ఉండి, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సదరు గిరిజన కుటుంబానికి జనసేన పార్టీ తరఫున రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, తమను పట్టించుకునే వారు లేరని బాధపడుతున్న తరుణంలో జనసేన నాయకులు నేరుగా ఇంటికే వచ్చి ఆదుకోవడంపై కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై జనసేన వీర మహిళలు, నాయకులు స్పందిస్తూ.. ఆ పిల్లల భవిష్యత్తుకు తమ భరోసా ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రమేష్ బాబు, మనీ, హరి, లక్ష్మణ్, అలాగే వీర మహిళలు కవితా రాణి, శారద, సుకన్య, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

పేట చిరంజీవి జన్మదినం-గిరిజన కుటుంబానికి జనసేన నిత్యావసరాల భరోసా