శ్రీ కాళహస్తి, జులై 18, (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీకాళహస్తి పట్టణాన్ని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుని, అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు. శనివారం మార్కెట్ యార్డ్ లో జరిగిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు, అధికారులు, కార్యకర్తలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశంలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పారిశుధ్యం ఎంతో ముఖ్యమని చెప్పారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సేవలను ప్రత్యేకంగా అభినందించి, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ, త్వరలోనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఇళ్ల పరిసరాలను నీట్ అండ్ క్లీన్ గా ఉంచుకోవాలని కోరారు.

స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర-పారిశుధ్యంపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పిలుపు