Sunday, 19 July 2026
  • Home  
  • బీజేపీ సంస్థాగత బలోపేతంపై విజయవాడలో కీలక సమీక్ష
- తిరుపతి

బీజేపీ సంస్థాగత బలోపేతంపై విజయవాడలో కీలక సమీక్ష

శ్రీ కాళహస్తి, జులై 18, (పున్నమి టెంపుల్ న్యూస్): భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను విస్తరించే లక్ష్యంతో విజయవాడలో శనివారం నిర్వహించిన రాష్ట్ర సంస్థాగత సమావేశం కీలకంగా సాగింది. నగరంలోని ఐవీ ప్యాలెస్‌లో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, జాతీయ కార్యదర్శి రితురాజ్ సిన్హా, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర పదాధికారులు, సీనియర్ నాయకులు హాజరయ్యారు. సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం, బూత్ స్థాయి నుంచి మండల, జిల్లా స్థాయిల వరకు పార్టీ కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేయడం, ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలను మరింత విస్తృతంగా తీసుకెళ్లే కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు. అలాగే కార్యకర్తల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, సభ్యత్వ విస్తరణ, ప్రజా సమస్యలపై పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, రానున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడంలో ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.