శ్రీ కాళహస్తి, జులై 18, (పున్నమి టెంపుల్ న్యూస్): భారతదేశ అంతరిక్ష చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖించబడిందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. పూర్తి స్వదేశీ సాంకేతికతతో, ప్రైవేట్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన దేశంలోని తొలి ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ శ్రీహరికోట నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ ఘట్టమన్నారు. సాంకేతిక కారణాల వల్ల ప్రయోగం స్వల్పంగా ఆలస్యమైనప్పటికీ, భారత శాస్త్రవేత్తలు సవాళ్లను సమర్థంగా అధిగమించి మధ్యాహ్నం 12:05 గంటలకు రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించడం దేశ సాంకేతిక సామర్థ్యానికి నిదర్శనమని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి, అంతరిక్ష రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, ప్రైవేట్ సంస్థలకు కల్పించిన అవకాశాల ఫలితంగానే భారతదేశం ఈ చారిత్రక విజయాన్ని సాధించగలిగిందని చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహం, ఇస్రో మార్గదర్శకత్వం, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో భారత అంతరిక్ష రంగం ప్రపంచంలో మరింత ఉన్నత స్థానాన్ని చేరుకుంటోందని అన్నారు. ఈ చారిత్రక విజయాన్ని సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలు, స్కైరూట్ ఏరోస్పేస్ బృందం, ఈ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ బొజ్జల సుధీర్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారతదేశం విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో మరిన్ని ఘన విజయాలను సాధిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హర్షం