ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 6 (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో అన్నమయ్య సంకీర్తన సంగీత విభావరి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్నమయ్య కీర్తనలను ఆలపించిన గరిమెళ్ల అనిల్ కుమార్‌ను అభినందించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ భారతీయ కళలు, భాష, సంస్కృతి మన అస్తిత్వానికి మూలస్తంభాలని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిదని అన్నారు. అన్నమయ్య సంకీర్తనలకు జీవితాన్ని అంకితం చేసిన దివంగత గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌కు నివాళులర్పిస్తూ, ఆయన సేవలను కొనియాడారు.

వెంకటాచలంలో అన్నమయ్య సంకీర్తన సంగీత విభావరి ఘనంగా
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 6 (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో అన్నమయ్య సంకీర్తన సంగీత విభావరి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్నమయ్య కీర్తనలను ఆలపించిన గరిమెళ్ల అనిల్ కుమార్‌ను అభినందించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ భారతీయ కళలు, భాష, సంస్కృతి మన అస్తిత్వానికి మూలస్తంభాలని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిదని అన్నారు. అన్నమయ్య సంకీర్తనలకు జీవితాన్ని అంకితం చేసిన దివంగత గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌కు నివాళులర్పిస్తూ, ఆయన సేవలను కొనియాడారు.

