Saturday, 6 June 2026
  • Home  
  • పదోన్నతిపై బదిలీ అయిన సర్వేయర్ సత్యనారాయణకు ఘన సన్మానం
- తూర్పు గోదావరి

పదోన్నతిపై బదిలీ అయిన సర్వేయర్ సత్యనారాయణకు ఘన సన్మానం

తాళ్లపూడి (పున్నమి ప్రతినిధి) జూన్ 6: తాళ్లపూడి మండల సర్వేయర్‌గా విధులు నిర్వహిస్తున్న పి. సత్యనారాయణ పదోన్నతిపై కొవ్వూరు స్పెషల్ యూనిట్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేగా బదిలీ కావడంతో శనివారం తాళ్లపూడి తహశీల్దార్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. తహశీల్దార్ లక్ష్మీ లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సత్యనారాయణకు శాలువా కప్పి జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ సర్వే విభాగంలో సత్యనారాయణ అందించిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. విధి నిర్వహణలో ఆయన చూపిన నిబద్ధత, అంకితభావం ఇతరులకు ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించి మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సర్వేయర్లు, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొని సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపారు.

తాళ్లపూడి (పున్నమి ప్రతినిధి) జూన్ 6:
తాళ్లపూడి మండల సర్వేయర్‌గా విధులు నిర్వహిస్తున్న పి. సత్యనారాయణ పదోన్నతిపై కొవ్వూరు స్పెషల్ యూనిట్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేగా బదిలీ కావడంతో శనివారం తాళ్లపూడి తహశీల్దార్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. తహశీల్దార్ లక్ష్మీ లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సత్యనారాయణకు శాలువా కప్పి జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ సర్వే విభాగంలో సత్యనారాయణ అందించిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. విధి నిర్వహణలో ఆయన చూపిన నిబద్ధత, అంకితభావం ఇతరులకు ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించి మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సర్వేయర్లు, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొని సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.