Saturday, 18 July 2026
  • Home  
  • సెల్ ఫోన్ల బానిసత్వం వద్దు….పట్టుదలతో శిఖరాలను చేరాలి: డిఎస్పి నరసింహమూర్తి
- తిరుపతి

సెల్ ఫోన్ల బానిసత్వం వద్దు….పట్టుదలతో శిఖరాలను చేరాలి: డిఎస్పి నరసింహమూర్తి

శ్రీ కాళహస్తి, జులై 18, (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీకాళహస్తిలోని స్థానిక వివేకానంద హైస్కూల్‌లో హెల్పింగ్ హ్యాండ్ సంస్థ 175వ ఉత్సవాన్ని విద్యార్థుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాళహస్తి డిఎస్పి నరసింహమూర్తి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఇటీవల కాలంలో సెల్ ఫోన్ల వాడకం మితిమీరడం వల్ల విద్యార్థులు వాటికి బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, దీనిపై తల్లిదండ్రులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఫోన్లను కేవలం చదువు, జనరల్ నాలెడ్జ్ కోసం మాత్రమే పరిమితంగా వాడుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని సూచించారు. శారీరక వైకల్యాన్ని జయించి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అరుణిమ సిన్హా, చిన్న వయసులోనే భారత క్రికెట్ జట్టుకు ఎంపికైన వైభవ్ సూర్య, పేదరికాన్ని జయించి టి20 వరల్డ్ కప్‌లో రాణించిన శ్రీచరణ్ ల పట్టుదలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని డిఎస్పి పిలుపునిచ్చారు. హెల్పింగ్ హ్యాండ్ సంస్థ వ్యవస్థాపకుడు మునీర్ బాయ్ మాట్లాడుతూ.. ఒకే బాటిల్‌లో పోసే నీరు, పాదరసం ఆధారంగా దాని విలువ మారినట్లే, విద్యార్థులలో ఉండే ప్రత్యేక ప్రతిభే వారి విలువను పెంచుతుందని చెప్పారు. చదువుతో పాటు సేవాభావాన్ని అలవర్చుకుని సమాజానికి మేలు చేయాలన్నారు. అనంతరం డిఎస్పి చేతుల మీదుగా దివ్యాంగులకు నిత్యావసర సరుకులు, విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గరికపాటి రమేష్ బాబు, గుమ్మల్ల రాజేశ్వరరావు, బాబా ఫరీద్, గాంధీ, కంట ఉదయ్, వివేకానంద స్కూల్ కరస్పాండెంట్ జితేంద్ర, వంశీ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.