Wednesday, 17 June 2026
  • Home  
  • ఆత్మకూరు బీసీ బాలికల గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలగా అప్‌గ్రేడ్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు బీసీ బాలికల గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలగా అప్‌గ్రేడ్

ఆత్మకూరు నియోజకవర్గంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక కృషి ఫలితంగా ఈ మంజూరు లభించింది. ఈ కళాశాలలో ఎం.పి.సి., బై.పి.సి. గ్రూపులను ప్రారంభించనున్నారు. దీనివల్ల స్థానిక, గ్రామీణ ప్రాంత పేద బాలికలకు దూర ప్రాంతాలకు వెళ్లే పనిలేకుండా స్థానికంగానే నాణ్యమైన ఇంటర్ విద్య అందుబాటులోకి రానుంది. మంత్రి ఆనం చొరవతో ఆత్మకూరుతో పాటు నెల్లూరు జిల్లా గోలగమూడిలోని గురుకుల పాఠశాల కూడా జూనియర్ కళాశాలగా అప్‌గ్రేడ్ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా ఆరు పాఠశాలలు అప్‌గ్రేడ్ కాగా, అందులో రెండు నెల్లూరు జిల్లాకే దక్కడం విశేషం. ఈ నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆత్మకూరు నియోజకవర్గంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక కృషి ఫలితంగా ఈ మంజూరు లభించింది. ఈ కళాశాలలో ఎం.పి.సి., బై.పి.సి. గ్రూపులను ప్రారంభించనున్నారు. దీనివల్ల స్థానిక, గ్రామీణ ప్రాంత పేద బాలికలకు దూర ప్రాంతాలకు వెళ్లే పనిలేకుండా స్థానికంగానే నాణ్యమైన ఇంటర్ విద్య అందుబాటులోకి రానుంది.
మంత్రి ఆనం చొరవతో ఆత్మకూరుతో పాటు నెల్లూరు జిల్లా గోలగమూడిలోని గురుకుల పాఠశాల కూడా జూనియర్ కళాశాలగా అప్‌గ్రేడ్ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా ఆరు పాఠశాలలు అప్‌గ్రేడ్ కాగా, అందులో రెండు నెల్లూరు జిల్లాకే దక్కడం విశేషం. ఈ నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.