దేశ అవసరాలను దేశీయంగా తీర్చుకునే సామర్థ్యం పెరిగితేనే భద్రతా రంగంలో పూర్తి స్వావలంబన సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆధునిక అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ ప్రెస్ యూనిట్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. రక్షణ, అంతరిక్ష, క్షిపణి, రైల్వే మరియు విమానయాన రంగాలకు అవసరమైన కీలక భాగాల తయారీకి ఈ కేంద్రం ఉపయోగపడనుంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవడం అత్యంత అవసరమని ఆయన చెప్పారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాధనలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు.

స్వావలంబనతోనే దేశ భద్రత మరింత బలోపేతం: రాజ్‌నాథ్ సింగ్