డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.
ప్రజలకు భరోసా కల్పించడానికే ప్రజాదర్బార్ కార్యక్రమం ద్వారా వారి చెంతకే వచ్చి వినతులు స్వీకరించి, సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. దేవరపల్లి మట్లదొడ్డిలో శుక్రవారం ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వయంగా స్వీకరించారు. మొత్తం 39 వినతులు వచ్చాయి. పలు సమస్యలను ఆయన అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మిగిలిన సమస్యలపై త్వరితగతిన ప్రతీ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.


