శామీర్ పేట గ్రామంలో బోనాల పండుగ
———————————–
జనగామ, ఆగష్టు 31,పున్నమి జిల్లా ప్రతినిధి :ఈ రోజు జనగామ జిల్లా శామీర్ పేట గ్రామం లో బోనాల పండుగ ఘనంగా జరుపుకోవడం జరిగిందని జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా శివరాజ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో బోనాలు చాలా ఘనంగా, ఉత్సాహంగా గ్రామ పెద్దలు, మహిళలు, నాయకులు,యువతీ యువకులు మరియు బంధుమిత్రులు
సంతోషంగా జరుపుకుంటామని తెలియచేసారు.



