*లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ,*
*మండలవ్యాప్తంగా పింఛన్ల పంపిణీని పర్యవేక్షించిన ఎంపీడీవో సాయిప్రసాద్*
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 01 వాకాడు మండలం,* మండల కేంద్రం వాకాడులో మంగళవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో సాయిప్రసాద్ లబ్ధిదారులకు పింఛన్ మొత్తాలను అందజేశారు. అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు సకాలంలో అందేలా అధికారులు చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో సాయిప్రసాద్ మాట్లాడుతూ.. మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగేలా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి పింఛన్ అందేలా సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. పింఛన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
మండలంలోని వివిధ గ్రామాల్లో కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. లబ్ధిదారులు పింఛన్లు అందుకోవడంతో సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పింఛన్లు తమకు ఆర్థికంగా ఎంతో తోడ్పడుతున్నాయని తెలిపారు.
ఎంపీడీవో వెంట ఏవో శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. మండలవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియను అధికారులు పర్యవేక్షించారు.



