Friday, 24 July 2026
  • Home  
  • మెగా పీటీఎంలో విద్యార్థులకు ప్రోత్సాహం.. నల్లమిల్లి మనోజ్ రెడ్డి సందేశం
- తూర్పు గోదావరి

మెగా పీటీఎంలో విద్యార్థులకు ప్రోత్సాహం.. నల్లమిల్లి మనోజ్ రెడ్డి సందేశం

అనపర్తి, జూలై 24 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): అనపర్తి గర్ల్స్ హైస్కూలు, బాయ్స్ హైస్కూలు, రామవరం హైస్కూలులో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (PTM) కార్యక్రమానికి అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్‌కు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి తన లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివితే ఉన్నత స్థానాలను చేరుకోవచ్చని సూచించారు. పిల్లల విద్యాభివృద్ధిపై తల్లిదండ్రులు నిరంతరం శ్రద్ధ చూపాలని, ఉపాధ్యాయులు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనపర్తి, జూలై 24 (రమేష్ నాయుడుపున్నమి ప్రతినిధి):
అనపర్తి గర్ల్స్ హైస్కూలు, బాయ్స్ హైస్కూలు, రామవరం హైస్కూలులో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (PTM) కార్యక్రమానికి అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
విద్యార్థుల భవిష్యత్‌కు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి తన లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివితే ఉన్నత స్థానాలను చేరుకోవచ్చని సూచించారు. పిల్లల విద్యాభివృద్ధిపై తల్లిదండ్రులు నిరంతరం శ్రద్ధ చూపాలని, ఉపాధ్యాయులు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేలా కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.