Tuesday, 1 September 2026
  • Home  
  • రేణిగుంట సబ్‌ డివిజన్‌ పరిధిలో సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు
- అన్నమయ్య

రేణిగుంట సబ్‌ డివిజన్‌ పరిధిలో సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు

సభలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలకు ముందస్తు పోలీస్‌ అనుమతి తప్పనిసరి రేణిగుంట: శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రేణిగుంట సబ్‌ డివిజన్‌ పరిధిలో సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు చేస్తున్నట్లు రేణిగుంట డీఎస్పీ శ్రీ వై. శ్రీనివాసరావు తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్‌ ఆదేశాల మేరకు 2026 సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌కు సంబంధించిన నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని డీఎస్పీ వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, ఇతర సామూహిక కార్యక్రమాలు నిర్వహించరాదని సూచించారు. ఈ నిషేధాజ్ఞలు రేణిగుంట సబ్‌ డివిజన్‌ పరిధిలోని రేణిగుంట, గాజులమండ్యం, ఏర్పేడు, రైల్వే కోడూరు, ఓబులవారిపల్లె, చిట్వేల్, పుల్లంపేట, పెనగలూరు పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో అమలులో ఉంటాయని తెలిపారు. సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ప్రజల శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని పోలీస్‌ శాఖ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సభలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలకు ముందస్తు పోలీస్‌ అనుమతి తప్పనిసరి రేణిగుంట: శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రేణిగుంట సబ్‌ డివిజన్‌ పరిధిలో సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు చేస్తున్నట్లు రేణిగుంట డీఎస్పీ శ్రీ వై. శ్రీనివాసరావు తెలిపారు.
తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్‌ ఆదేశాల మేరకు 2026 సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌కు సంబంధించిన నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని డీఎస్పీ వెల్లడించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, ఇతర సామూహిక కార్యక్రమాలు నిర్వహించరాదని సూచించారు.
ఈ నిషేధాజ్ఞలు రేణిగుంట సబ్‌ డివిజన్‌ పరిధిలోని రేణిగుంట, గాజులమండ్యం, ఏర్పేడు, రైల్వే కోడూరు, ఓబులవారిపల్లె, చిట్వేల్, పుల్లంపేట, పెనగలూరు పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో అమలులో ఉంటాయని తెలిపారు.
సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ప్రజల శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని పోలీస్‌ శాఖ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.