Monday, 20 April 2026
  • Home  
  • అన్నా క్యాంటీన్‌లో భోజన వితరణ – సీఎం జన్మదిన వేడుకలు ఘనంగా
- ఆంధ్రప్రదేశ్

అన్నా క్యాంటీన్‌లో భోజన వితరణ – సీఎం జన్మదిన వేడుకలు ఘనంగా

పేదల ఆకలి తీర్చే గొప్ప పథకంగా పేరుగాంచిన అన్నా క్యాంటీన్ కార్యక్రమం నెల్లూరులో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఒకే రోజు ₹76 లక్షలను అన్నా క్యాంటీన్లకు అందించడం శుభపరిణామమని పలువురు అభిప్రాయపడ్డారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 32వ డివిజన్ డైకాస్ రోడ్డు సెంటర్‌లో జరిగిన భోజన వితరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో అన్నా క్యాంటీన్లను మూసివేయడం పేదలకు అన్యాయమని విమర్శించారు. అన్నా క్యాంటీన్లు సమర్థవంతంగా కొనసాగాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పేదల ఆకలి తీర్చే గొప్ప పథకంగా పేరుగాంచిన అన్నా క్యాంటీన్ కార్యక్రమం నెల్లూరులో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఒకే రోజు ₹76 లక్షలను అన్నా క్యాంటీన్లకు అందించడం శుభపరిణామమని పలువురు అభిప్రాయపడ్డారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం 32వ డివిజన్ డైకాస్ రోడ్డు సెంటర్‌లో జరిగిన భోజన వితరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో అన్నా క్యాంటీన్లను మూసివేయడం పేదలకు అన్యాయమని విమర్శించారు.
అన్నా క్యాంటీన్లు సమర్థవంతంగా కొనసాగాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.