నెల్లూరు రూరల్ నియోజకవర్గం 38వ డివిజన్ సరోజినీ నగర్‌లో స్మైల్ ప్రాజెక్ట్‌ను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, మున్సిపల్ కమిషనర్ వై.ఓ. నందన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నందిమండలం భాను శ్రీ పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ స్మైల్ ప్రాజెక్ట్ ద్వారా బిక్షాటనలో ఉన్నవారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించడం, వారికి ఆహారం, వైద్య పరీక్షలు, కౌన్సిలింగ్ అందించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్రం ప్రతి సంవత్సరం ₹53 లక్షలు కేటాయిస్తుండగా, భవన పునరుద్ధరణ కోసం మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ₹10 లక్షలు ఖర్చు చేశారు.
ఈ కార్యక్రమం ద్వారా నిరాశ్రయులకు ఆశ్రయం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించి గౌరవప్రదమైన జీవితం అందించడమే లక్ష్యమని తెలిపారు. ప్రజలు కూడా భాగస్వాములై బిక్షాటన రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

స్మైల్ ప్రాజెక్ట్ ప్రారంభం – నిరాశ్రయులకు పునరావాసం లక్ష్యం
నెల్లూరు రూరల్ నియోజకవర్గం 38వ డివిజన్ సరోజినీ నగర్‌లో స్మైల్ ప్రాజెక్ట్‌ను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, మున్సిపల్ కమిషనర్ వై.ఓ. నందన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నందిమండలం భాను శ్రీ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ స్మైల్ ప్రాజెక్ట్ ద్వారా బిక్షాటనలో ఉన్నవారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించడం, వారికి ఆహారం, వైద్య పరీక్షలు, కౌన్సిలింగ్ అందించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్రం ప్రతి సంవత్సరం ₹53 లక్షలు కేటాయిస్తుండగా, భవన పునరుద్ధరణ కోసం మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ₹10 లక్షలు ఖర్చు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా నిరాశ్రయులకు ఆశ్రయం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించి గౌరవప్రదమైన జీవితం అందించడమే లక్ష్యమని తెలిపారు. ప్రజలు కూడా భాగస్వాములై బిక్షాటన రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

