నా దేహాన్ని ఎవరో భద్రపరిచిన అనుభూతి,
ఎక్కడున్నానో తెలీదు,ఎలా ఉన్నానో కూడా తెలియదు
ఊపిరాడక ఏదో గొంతును పట్టుకున్న అనుభూతి,
నీటిలో తేలుతున్నట్లు జారుడుబండ ఆట ఆడుతున్నట్లు,
ఎలా గడిచిందో ఎన్ని రోజులు గడిచిందో తెలియదు
ఒకానొక రోజు!
ఉన్నట్లుండి కళ్ళు తెరిచాను, ఒక్కసారిగా వెలుగును చూశాను వేరే ప్రపంచంలోకి వచ్చినట్లుంది నాకు,
తెలియకనే బోరున ఏడుస్తున్నాను ఎందుకో తెలియదు,
ఇన్ని రోజులు సుతి మెత్తటి గుడ్డ ఏదో భద్రపరిచింది
కానీ ఇప్పుడు నా దేహం అంతా రక్తం
ఇంతలో ఓ వర్షపు చినుకు నా మేనుని తడిపింది ,
ఓ చుక్క నీరు గొంతులోకి పోయింది శరీరానికి శక్తి వచ్చినట్లు ఉంది,
ఒకానొక రోజు ఈ ప్రపంచంలో నేను ఒకడిని అనుకున్నాను
అనుకున్న మరుక్షణం నాకు అమ్మ గుర్తుకు వచ్చింది,
అమ్మను చూడాలనుకున్నాను అమ్మ రూపం కూడా నాకు తెలియదు
ఒకరోజు నా స్నేహితుడు ఆడుతూ ఉన్నప్పుడు తగిలిన గాయాన్ని అమ్మ ఆత్రుతతో వచ్చి కన్నీరు కారుస్తూ పయట కొంగుతో తుడుస్తూ ఉంటే,
మా అమ్మ కుడా నాకు ఇలాగే చేసిందనుకున్నాను.
పదేళ్ల వయసులో టైరు బండితో ఆడుతున్నపుడు,
ఓ తల్లి చందమామను చూపించి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే!
మా అమ్మ కూడా నాకు ఇలాగే పెట్టింది అనుకున్నా!
పాతికేళ్ల వయసులో పెళ్లి అనే బంధంతో ఓస్త్రీ నాకు దగ్గరై, ఆమె నాపై కురిపించే ప్రేమను చూసి తానే అమ్మ అయి వచ్చిందని సంబరపడ్డాను.
నాకు జ్వరం వచ్చినప్పుడు రాత్రంతా సేవలు చేసిన భార్యను చూసి అమ్మను చూశాను అన్న సంతోషం కలిగింది.
రక్తపు ముద్దలా ఉన్న నా బిడ్డను సంతోషంగా ఎత్తుకున్నప్పుడు మా అమ్మ కూడా నన్ను ఇలాగే ఎత్తుకుందనుకున్నాను.
చిన్నతనంలో అమ్మకు అమ్మ ప్రేమకు దూరమైన అతను, తన ఎదుగుదలలో ప్రతిక్షణం అమ్మ ప్రేమానుభూతిని పొందుతున్నాడు.
అందుకే..!
” అమ్మతనములోన కమ్మదనమేముంది రా, అమృత మునకే ఆమె తీపి నేర్పిందిరా ” –
—కవి, రచయిత -కె. రెడ్డప్ప (భౌతిక శాస్త్ర అధ్యాపకులు, DSR హై స్కూల్, అల్లూరు )
కె. రెడ్డప్ప, (

తల్లికి ప్రేమతో
నా దేహాన్ని ఎవరో భద్రపరిచిన అనుభూతి, ఎక్కడున్నానో తెలీదు,ఎలా ఉన్నానో కూడా తెలియదు ఊపిరాడక ఏదో గొంతును పట్టుకున్న అనుభూతి, నీటిలో తేలుతున్నట్లు జారుడుబండ ఆట ఆడుతున్నట్లు, ఎలా గడిచిందో ఎన్ని రోజులు గడిచిందో తెలియదు ఒకానొక రోజు! ఉన్నట్లుండి కళ్ళు తెరిచాను, ఒక్కసారిగా వెలుగును చూశాను వేరే ప్రపంచంలోకి వచ్చినట్లుంది నాకు, తెలియకనే బోరున ఏడుస్తున్నాను ఎందుకో తెలియదు, ఇన్ని రోజులు సుతి మెత్తటి గుడ్డ ఏదో భద్రపరిచింది కానీ ఇప్పుడు నా దేహం అంతా రక్తం ఇంతలో ఓ వర్షపు చినుకు నా మేనుని తడిపింది , ఓ చుక్క నీరు గొంతులోకి పోయింది శరీరానికి శక్తి వచ్చినట్లు ఉంది, ఒకానొక రోజు ఈ ప్రపంచంలో నేను ఒకడిని అనుకున్నాను అనుకున్న మరుక్షణం నాకు అమ్మ గుర్తుకు వచ్చింది, అమ్మను చూడాలనుకున్నాను అమ్మ రూపం కూడా నాకు తెలియదు ఒకరోజు నా స్నేహితుడు ఆడుతూ ఉన్నప్పుడు తగిలిన గాయాన్ని అమ్మ ఆత్రుతతో వచ్చి కన్నీరు కారుస్తూ పయట కొంగుతో తుడుస్తూ ఉంటే, మా అమ్మ కుడా నాకు ఇలాగే చేసిందనుకున్నాను. పదేళ్ల వయసులో టైరు బండితో ఆడుతున్నపుడు, ఓ తల్లి చందమామను చూపించి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే! మా అమ్మ కూడా నాకు ఇలాగే పెట్టింది అనుకున్నా! పాతికేళ్ల వయసులో పెళ్లి అనే బంధంతో ఓస్త్రీ నాకు దగ్గరై, ఆమె నాపై కురిపించే ప్రేమను చూసి తానే అమ్మ అయి వచ్చిందని సంబరపడ్డాను. నాకు జ్వరం వచ్చినప్పుడు రాత్రంతా సేవలు చేసిన భార్యను చూసి అమ్మను చూశాను అన్న సంతోషం కలిగింది. రక్తపు ముద్దలా ఉన్న నా బిడ్డను సంతోషంగా ఎత్తుకున్నప్పుడు మా అమ్మ కూడా నన్ను ఇలాగే ఎత్తుకుందనుకున్నాను. చిన్నతనంలో అమ్మకు అమ్మ ప్రేమకు దూరమైన అతను, తన ఎదుగుదలలో ప్రతిక్షణం అమ్మ ప్రేమానుభూతిని పొందుతున్నాడు. అందుకే..! ” అమ్మతనములోన కమ్మదనమేముంది రా, అమృత మునకే ఆమె తీపి నేర్పిందిరా ” – —కవి, రచయిత -కె. రెడ్డప్ప (భౌతిక శాస్త్ర అధ్యాపకులు, DSR హై స్కూల్, అల్లూరు ) కె. రెడ్డప్ప, (

